IND Vs AUS: నాగ్‌‌పూర్ టీ20లో టీమిండియా విజయం

IND Vs AUS: ఆసిస్ దూకుడుకు కళ్లెంవేసిన టీమిండియా.. రోహిత్ శర్మ వీరోచిత పోరాటం

Update: 2022-09-24 00:59 GMT

IND Vs AUS: నాగ్‌‌పూర్ టీ20లో టీమిండియా విజయం

IND Vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఆసిస్ దూకుడుకు కళ్లెంవేసిన టీమిండియా బౌలర్లు తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో సఫలీ కృతమయ్యారు. లక్ష్య ఛేదనలో కెప్టన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటంతో జట్టును విజయ తీరం చేర్చాడు. వర్షం కారణంగా మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి90 పరుగులు చేసింది. 91 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అలవోకగా విజయాన్ని కైసవం చేసుకుంది. కెప్టన్ రోహిత్ శర్మ ప్రారంభ ఓవర్లోనే ఆద్భుతమైన సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రారంభ ఓవర్లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాదితే... లోకేశ్ రాహుల్ కళ్లు చెదిరే సిక్సర్తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్లోనూ రోహిత్ శర్మ మరో సిక్సర్ నమోదు చేశాడు. మూడో ఓవర్లోనూ మరో సిక్సర్ తో అభిమానుల్ని అలరించాడు.

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ లోకేశ్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ రెండు బౌండరీతో ఊపు తెప్పించాడు. ఐదో ఓవర్లో తొలి బంతిని బౌండరీగా మలచిన కోహ్లీని తర్వాతి బంతి మాయచేసింది. వెనువెంటనే సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబల్యూగా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్యా ఓ బౌండరీ కొట్టిన తర్వాత షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. క్రీజులో ఉన్న రోహిత్ శర్మకు దినేశ్ కార్తిక్ తోడై ఓ సిక్సర్, మరో బౌండరీతో జట్టును విజయతీరం చేర్చాడు. కెప్టన్ రోహిత్ శర్మ 20 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

Tags:    

Similar News