IND vs ENG 2021: కోహ్లీసేన క్లీన్‌స్వీప్ చేస్తుంది: సునీల్ గవాస్కర్
IND vs ENG 2021: ఇంగ్లాండ్ పర్యటనకు టీం ఇండియా ఆటగాళ్లు బయలు దేరిన సంగతి తెలిసిందే.
IND vs ENG 2021: ఇంగ్లాండ్ పర్యటనకు టీం ఇండియా ఆటగాళ్లు బయలు దేరిన సంగతి తెలిసిందే. అయితే మొదట న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి, ఆ తరువాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈమేరకు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 4-0 తేడాతో కోహ్లీ సేన క్లీన్‌స్వీప్ చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరగనుంది.
ఈ మేరకు భారత జట్టు బుధవారం ఇంగ్లాండ్ దేశంలో అడగుపెట్టింది. సౌథాంప్టన్‌లో ఆటగాళ్లంతా క్వారంటైన్ లో ఉన్నారు. 3రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం ప్రాక్టీస్ మొదలపెట్టనున్నారు. మొదట న్యూజిలాండ్‌తో జూన్ 18న డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నారు.
అనంతరం ఆగస్టు, సెప్టెంబర్లో ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్‌లో ముఖ్యంగా ఇంగ్లాండ్.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తుంది. ఇటీవల భారత్ లో పర్యటించిన ఇంగ్లీస్ జట్టు టెస్టుల్లో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌లో ఎండాకాలం కావడంతో పిచ్‌లు టర్న్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
'న్యూజిలాండ్‌తో ఫైనల్ తరువాత ఆరు వారాలకు ఇంగ్లాండ్ సిరీస్ మొదలుకానుంది. డబ్యూటీసీ ఫైనల్ ప్రభావం భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌పై ఎక్కువగా ఉండదు. టీం ఇండియానే కచ్చితంగా సిరీస్ గెలుస్తుంది. 4-0తో సిరీస్‌ను స్వీప్ చేస్తుంది. భారత్ పర్యటనలో స్పిన్ పిచ్‌లపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ కారణంగా ఇంగ్లాండ్‌లో పిచ్‌లపై పచ్చికను ఉంచినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ పచ్చిక కోహ్లీసేనకు సమస్యేమీ కాదని నా అభిప్రాయం. అలాంటి పిచ్‌లపై రాణించగల పేసర్లు టీం ఇండియాలో ఉన్నారు. వీరతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశముంద'ని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.