IND vs SA: సఫారీలతో సమరానికి సన్నద్ధమైన టీమిండియా

IND vs SA: ప్రపంచకప్‌ పోటీలకు ముందుగా సన్నాహక సిరీస్

Update: 2022-09-28 01:15 GMT

IND vs SA: సఫారీలతో సమరానికి సన్నద్ధమైన టీమిండియా

IND vs SA: సఫారీలతో సమరానికి టీమిండియా సన్నద్ధమైంది. తిరువనంతపురం చేరుకున్న ఆటగాళ్లు దక్షిణాఫ్రికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు. దిగ్గజ జట్లల్లో దక్షిణాఫ్రికాను తక్కువగా అంచనా వేయకూడదని అన్ని విభాగాల్లో బాధ్యతాయుతంగా రాణిస్తే విజయం సాధించవచ్చే భావనతో బరిలోకి దిగుతున్నారు. ఆస్ట్రేలియాపై సాధించిన విజయోత్సాహంతో దక్షిణాఫ్రికాను ఎదుర్కొనేందుకు రోహిత్ సేన తిరువనంతపురం చేరుకుంది. తొలి టీ20 మ్యాచ్‌లో ఇవాళ సాయంత్రం పోటీ పడబోతోంది. సమ ఉజ్జీలుగా ఉన్న ఇరుజట్లు సత్తాచాటేందుకు ఎదురుచూస్తు్న్నాయి. ప్రపంచకప్‌ పోటీలకు ముందుగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రపంచకప్‌పోటీలకు ముందుగా ఈ మ్యాచ్‌లు కీలకం కాబోతున్నాయి. విరాట్ బ్యాటింగ్ ‌తో మెరుగైన ప్రదర్శన చేయాలని కోహ్లీ సాధన చేశాడు.

బౌలింగ్‌తో హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ పదునైన బంతులు సంధించి సఫారీలను కంగారుపెట్టాలని చూస్తున్నారు. దినేశ్ కార్తిక, రిషబ్ పంత్‌ ఎవరికి అవకాశం వచ్చినా సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. దక్షిణాఫ్రికా ఈ సంవత్సరంలో దాదాపు 18 మ్యాచ్‌లను ఎదుర్కొని 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించి టీమిండియాపై పైచేయి సాధించాలని దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగా బరిలో దిగనుంది. టీమిండియా తరఫున కెప్టన్ రోహిత్ శర్మతోపాటు లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజువేంద్ర ఛాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ బరిలో దిగబోతున్నారు.

Tags:    

Similar News