కామన్వెల్త్ పోటీల్లో సత్తా చాటిన టీమిండియా మహిళా క్రికెట్ టీం
Commonwealth Games 2022: సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ చేరుకున్న టీమిండియా
Commonwealth Games 2022: కామన్వెల్త్ పోటీల్లో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా సత్తా చాటింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు స్మృతీ మంధాన - షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 76 పరుగులను జోడించారు. ఈ క్రమంలో మంధాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. కామన్వెల్త్ పోటీల్లో ఓటమి ఎరుగని ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కట్టడిచేశారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఇంగ్లాండ్‌ను 160 పరుగులకు పరిమితం చేశారు. దీంతో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఫైనల్లో తలపడనున్న టీమిండియాకు పతకం ఖాయం చేసుకుంది. ఈరోజు బర్మింగ్‌హామ్‌లో జరిగే ఫైనల్ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడనుంది.