KL Rahul: క్రికెట్ తప్ప మాకు ఏం తెలియదు, ట్రోలింగ్స్ పై కేఎల్ రాహుల్ వేదన
*ట్రోలింగ్స్ పై టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్. రాహుల్ తొలిసారి రియాక్ట్ అయ్యాడు. మితిమీరిన ట్రోలింగ్ తో ఆటగాళ్ల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటాయని...హద్దులమీరిన ట్రోలింగ్ తో ఎంతో వేదనకు గురయ్యానన్నాడు..క్రికెట్ తప్ప తనకు ఏం తెలియదంటూ రాహుల్...
KL Rahul: టీమిండియా క్రికెటర్, లఖ్ నవూ సారథి కేఎల్ రాహుల్ పై గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ట్రోలింగ్ వ్యవహారం పై మౌనంగా ఉన్న రాహుల్ మొట్టమొదటిసారి పెదవి విప్పాడు. ట్రోలింగ్ కారణంగా తన మనసు ఎంత గాయపడిందో చెబుతూ వేదన వెళ్లగక్కాడు. ట్రోలింగ్ మితిమీరితే అది ఆటగాళ్ల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పుకొచ్చాడు. ట్రోలింగ్ కారణంగా తనతో పాటు తన సహచర ఆటగాళ్లు సైతం చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని రాహుల్ తెలిపాడు.
క్రికెటే మా జీవితం:
క్రికెట్ లో ప్రతి ఆటగాడు మంచి ప్రదర్శన ఇవ్వాలని ట్రై చేస్తాడని..ఎందుకంటే తమకు క్రికెట్ తప్ప మరొకటి తెలియదని రాహుల్ భావోద్వేగం వ్యక్తం చేశాడు. తాను గ్రౌండ్ లోకి దిగితే 100 శాతం న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఉంటానని చెప్పుకొచ్చాడు. తాను బాగా ఆడడం లేదని కొందరు దూషించడం ఎంతగానో బాధ కలిగించిందన్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా అలా ఎలా అంటారో తనకు అర్థం కావడం లేదని కేఎల్. రాహుల్ మధనపడ్డాడు. ఆటలో ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం రాదాని..తనకు అలాంటి పరిస్థితులు చాలానే ఎదురయ్యాయని చెప్పాడు.
ట్రోలింగ్ కి కారణం:
ఇంటర్నేషనల్ క్రికెట్ లో రాహుల్ ప్రదర్శన చాలా రోజులుగా అంతంత మాత్రంగానే ఉంది. ఆమధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ విఫలం అయ్యాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ లో బాగానే ఆడినా స్ట్రయిక్ రేట్ విషయంలో విమర్శలపాలయ్యాడు. వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నాడంటూ రాహుల్ ను ట్రోల్ చేశారు. మరోవైపు తొడ కండరాల గాయంతో ప్రస్తుత ఐపీఎల్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకొని కేఎల్. రాహుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు.