Rohit-Virat: ఆ ఇద్దరు దండగా..కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వాల్సిందే.. సంచలన డిమాండ్!
Rohit-Virat: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలన్న సంచలన డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ ఇద్దరు కూడా దండగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీసీసీఐ సైతం ఈ ఇద్దరు ఆటగాళ్లపై సీరియస్ గా ఉంది. సీనియర్లపై వేటుకు బోర్డు సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. స్వదేశంలో అడిన టెస్టు సిరీస్ ఆఖరిదేనా?
Rohit-Virat want to retire: టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వదేశంలో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడేశారా? దిగ్గజ స్పిన్నర్స్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మన పిచ్ లపై చివరిసారిగా బౌలింగ్ చేసేశారా...ఈ ప్రశ్నలు ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్నాయి. హోం టౌన్ లో న్యూజిలాండ్ తో ఊహించని రీతిలో పరాజయం తర్వాత టీమిండియా సీనియర్ల టెస్టు భవితవ్యం సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆదివారం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో ఓడిపోయిన టీమిండియా తొలిసారి వైట్‌వాష్‌ను చవిచూసింది. ఈ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాపై ఒత్తిడి బాగా పెరిగింది. విరాట్, రోహిత్ పేలవమైన ఫామ్ పై మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ కర్సన్ ఘావ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల హోమ్ టెస్ట్ సిరీస్‌లో దారుణంగా ప్లాప్ అయ్యారు. మూడు మ్యాచ్‌లు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్ హాఫ్ సెంచరీ చేయగా..రోహిత్ శర్మ కూడా 6 ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీ మాత్రమే చేశాడు. ఇద్దరు దిగ్గజాల పేలవమైన ఫామ్‌ను చూసిన టీమిండియా మాజీ వెటరన్ ఫాస్ట్ బౌలర్ కర్సన్ ఘావ్రీ రోహిత్, కోహ్లీలకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అంటూ బాంబు పేల్చాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కర్సన్ ఘావ్రీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు సీనియర్లు రాణించలేరని..వారు క్లాస్ ప్లేయర్స్ అని స్పష్టంగా తెలుస్తుంది.విరాట్,రోహిత్ ఇద్దరూ ఒత్తిడిలోనే ఉన్నారు. వారు ఎక్కువగా పరుగులు చేయాలి. శుభ్ మాన్ వంటి బ్యాట్స్ మెన్ ముందుకు వచ్చి భారీ స్కోర్ చేయాల్సి ఉంటుందన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రోహిత్, విరాట్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని..200శాతం స్కోర్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాలో రాణించకపోతే టెస్ట్ కెరీర్ పై నిర్ణయం తీసుకోవాలి. ఆస్ట్రేలియా టెస్టులో ఈ సీనియర్లు ఇద్దరూ రాణించకపోతే రిటైర్మెంట్ తీసుకోవాలి. వీరిద్దరూ భారత్ జట్టు కోసం ఎంతో చేశారు. కానీ మంచి ప్రదర్శన కనబర్చనట్లయితే వీరిని జట్టులో ఎంతకాలం ఉంచుతాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా తాజా కివీస్ పై ఓటమి పట్ల బీసీసీఐ కూడా అసంతృప్తిగానే ఉంది. గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్ ఫ్యూచర్ కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నా..ఇలాంటి ఫలితం రావడంతో బీసీసీఐ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో టెస్టు జట్టులో సమూ మార్పులు చేయాలని భావిస్తోందట బీసీసీఐ. ముఖ్యంగా రోహిత్, విరాట్ టెస్టు భవితవ్యంపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.