IND vs NZ Test Series: 3వ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ విజయం.. తొలిసారిగా ఆ బ్యాడ్ రికార్డ్ మూటగట్టుకున్న ఇండియా

Update: 2024-11-03 08:57 GMT

IND vs NZ Test Series 3rd Test Day 3 match Highlights: ఇండియా vs న్యూజిలాండ్ జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో 25 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. దీంతో న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌లో విజయం సొంతం చేసుకుంది. అది కూడా సొంత గడ్డపైనే టీమిండియా జట్టు ఈ విధంగా పరాజయం పాలైంది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఔట్ చేసిన టీమిండియా 263 పరుగులు చేసి శభాష్ అనిపించుకుంది. ఇండియా , న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా స్పిన్ ట్విన్స్ రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్స్ పడగొట్టి కివీస్ సేనను 174 పరుగులకు పరిమితం చేయగలిగారు. కానీ ఛేజింగ్ లోనే టీమిండియా తడబడింది. కేవలం 29 పరుగులకే టీమిండియా 5 వికెట్స్ కోల్పోయింది.

రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి కీలకమైన వికెట్స్ ని కోల్పోయిన టీమిండియా చిక్కుల్లో పడింది. అలాంటి సమయంలో రిషబ్ పంత్ ఒక్కడే జట్టును గెలిపించే దిశగా అడుగులేశాడు కానీ అది కూడా సాధ్యపడలేదు. రిషబ్ పంత్ 57 బంతుల్లో 64 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు కానీ అతడి వికెట్ కూడా పడటంతో ఆ ఆశలు కూడా గల్లంతయ్యాయి.

2000 సంవత్సరంలో సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో ఓడిపోయింది. ఆ తరువాత మళ్లీ సొంతగడ్డపై భారత్ క్లీన్ స్వీప్ అవడం ఇదే తొలిసారి.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం న్యూజిలాండ్ జట్టు కూడా సొంత గడ్డపైనైనా లేదా విదేశీ గడ్డపైనైనా ఇలా ఒక టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

Tags:    

Similar News