IPL 2025 Retentions: ఐపీఎల్‌ వేలంపై ఆసక్తిని పెంచిన రిటెన్షన్‌ లిస్ట్‌.. అందరి దృష్టి వీరిపైనే..!

IPL 2025 Retentions: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పుడే చర్చ మొదలైంది. మెగా వేలం నిర్వహించే కంటే ముందు ఆటాగాళ్ల రిటెన్షన్‌ లిస్ట్ వచ్చేసింది.

Update: 2024-11-01 06:49 GMT

IPL 2025 Retentions: ఐపీఎల్‌ వేలంపై ఆసక్తిని పెంచిన రిటెన్షన్‌ లిస్ట్‌.. అందరి దృష్టి వీరిపైనే..!

IPL 2025 Retentions: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పుడే చర్చ మొదలైంది. మెగా వేలం నిర్వహించే కంటే ముందు ఆటాగాళ్ల రిటెన్షన్‌ లిస్ట్ వచ్చేసింది. ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్లేయర్స్‌ను అట్టిపెట్టుకొని ఇతరుల జాబితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా 10 ఫ్రాంఛైజీలు కలిపి 46 మందిని రిటైన్ చేసుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఇక స్టార్‌ ప్లేయర్స్‌లో ధోనీ రూ. 4 కోట్లతో తక్కువ ధరకు పలికారు. అయితే రిటైన్ చేసుకోని ప్లేయర్స్‌ జాబితాలో కూడా స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే కొందరు స్టార్‌ ప్లేయర్స్‌ స్వయంగా వారే వేలంలోకి వచ్చారు. ఇంతకీ ఆ ప్లేయర్స్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

రిటైన్‌ కానీ స్టార్‌ ప్లేయర్స్‌లో ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఉన్నాడు. కెప్టెన్సీ అనుభవం, వికెట్‌ కీపింగ్‌, దూకుడైన బ్యాటింగ్‌ వంటి బెస్ట్‌ లక్షణాలు ఉన్న పంత్‌కు మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక లఖ్‌నవూ టీమ్‌ కెప్టెన్‌ రాహుల్‌ని ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. దీంతో కేఎల్‌ రాహుల్‌కి కూడా వేలంలో పోటీ ఉండే అవకాశం ఉంది. అదే విధంగా శ్రేయస్‌ అయ్యర్‌ను కోల్‌కతా ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోలేదు. కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ను వదులుకోవడం గమనార్హం.

ఇక ముంబయి విషయానికొస్తే.. ఇషాన్‌ కిషన్‌ను వదులుకుంది. అలాగే ఆర్సీబీ మహ్మద్‌ సిరాజ్‌ను ఆర్సీబీ అట్టిపెట్టుకోలేదు. మహ్మద్‌ షమీని గుజరాత్ ఫ్రాంచైజీ రిటైన్‌ చేసుకోలేదు. యుజ్వేంద్ర చాహల్‌ను రాజస్థాన్‌ వదులుకుంది. అయితే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రెడిట్ ఉన్న చాహల్‌ను వదులుకోవడం గమనార్హం. ఇక పంజాబ్‌ కింగ్స్‌ అశుతోష్ శర్మను వదులుకుంది. అలాగే శిఖర్ ధావన్, అర్ష్‌దీప్‌ను సైతం రిటైన్‌ చేసుకోలేదు.

విదేశీ ప్లేయర్స్‌ విషయానికొస్తే..

* ఫాఫ్‌ డుప్లెసిస్‌ను ఆర్సీబీ వదులుకుంది. కాగా కోహ్లీని రూ.21 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అలాగే విల్‌ జాక్స్‌, కామెరూన్‌ గ్రీన్‌ను కూడా బెంగళూరు వదులుకుంది.

* చెన్నై సూపర్‌ కింగ్స్‌ రచిన్‌ రవీంద్రను వదులుకుంది. డెవాన్‌ కాన్వేను చెన్నై రిటైన్‌ చేసుకోలేదు.

* మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రిటైన్‌ చేసుకోలేదు. అయితే మిచెల్‌ను గత సీజన్‌కు ముందు మినీ వేలంలో రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

* క్వింటన్ డికాక్‌, మార్కస్‌ స్టాయినిస్‌లను లఖ్‌నవూ వదులుకుంది.

* టిమ్‌ డేవిడ్‌ను ముంబయి వదులుకుంది.

' పంజాబ్‌ విషయానికొస్తే.. జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, కగిసో రబాడ, లివింగ్‌స్టోన్‌లను వదులుకుంది.

* రాజస్థాన్‌ రాయల్స్‌ ట్రెంట్ బౌల్ట్, జోస్‌ బట్లర్‌ను రిటైన్‌ చేసుకోలేదు.

Tags:    

Similar News