Conflict of Interest on Virat kohli: చిక్కుల్లో విరాట్ కోహ్లీ

Conflict of Interest on Virat kohli: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల(కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్)సెగ తగిలింది.

Update: 2020-07-06 03:42 GMT
Virat kohli (file photo)

Conflict of Interest on Virat kohli: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల(కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్)సెగ తగిలింది. భారత జట్టుకు సారథిగా ఉన్న కోహ్లీ రెండు వ్యాపార సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడని, అది కచ్చితంగా కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశాడు. విరాట్‌ కోహ్లి స్పోర్ట్స్‌, కార్నర్‌స్టోన్‌ వెంచర్స్‌ పార్ట్‌నర్స్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నాడని, ఆ సంస్థల్లో సహ డైరెక్టర్లుగా ఉన్న కొందరు భారత ప్లేయర్స్ వ్యాపార వ్యవహారాలు చూసుకునే కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కూడా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బీసీసీఐ నిబంధనలు విరాట్ కోహ్లి ఉల్లంఘించాడని తెలిపాడు. ఒకేసారి రెండు పదవుల్లో ఉన్న విరాట్‌ కోహ్లి.. సుప్రీం కోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యంగంలోని 38(4) నిబంధనను అతిక్రమించాడు. ప్రస్తుతం కోహ్లీ 38 (4)ఎ ప్రకారం ఆటగాడిగా, 38 (4)ఒ ప్రకారం ఓ సంస్థకు చెందిన పదవిలో ఉన్నాడని బీసీసీఐ నైతిక నియమావళి అధికారి, అంబుడ్స్‌మన్‌ అయిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డీకే జైన్‌తో పాటు అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సీఈఓ రాహుల్‌ జోహ్రి తదితరులకు సంజీవ్‌ తన ఫిర్యాదును ఈ మెయిల్‌ చేశాడు.

జస్టిస్‌ జైన్‌ స్పందించారు.. కోహ్లికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు జస్టిస్‌ జైన్‌ తెలిపారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదు అందింది. దాన్ని పరిగణలోకి తీసుకోవాలో లేదో అని పరిశీలిస్తా. ఒకవేళ పరిగణించే అవకాశం ఉంటే .. స్పందించేందుకు కోహ్లికి అవకాశమిస్తా అని జైన్‌ అన్నారు. బీసీసీఐ 38(4) నిబంధన ప్రకారం క్రికెటర్లు కార్యకలాపాలకు చెందిన ఏ అధికారి కానీ రెండు పదవుల్లో ఉండకూడదని జైన్‌ తెలిపారు. 


Tags:    

Similar News