Virat Kohli: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన దూకుడును అటు ఆటలోనే కాకుండా తన సహచరులపై ప్రత్యర్ధి జట్టు సభ్యులు ఏవిధంగానైనా ఇబ్బందిపెట్టిన అందరికంటే ముందు తానే ఉంటూ కోపాన్ని మైదానంలోనే చూపిస్తుంటాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ లో ఐదో రోజు దూకుడుగా కనిపించిన విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ ఆటగాళ్ళను తన స్టైల్ లో స్లెడ్జ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు 60 ఓవర్లలో 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సమయంలో బౌలింగ్ చేయడానికి సిద్ధం అవుతున్న భారత జట్టు సభ్యులతో కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీం జట్టును ఉత్తేజపరుస్తూ ఈ 60 ఓవర్లు ఇంగ్లాండ్ జట్టుకు నరకం చూపించాలని విరాట్ కోహ్లి ఆటగాళ్ళతో చెప్తూన్న వీడియో ఇంటర్నెట్ లో ఇపుడు హల్చల్ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భారత బౌలర్స్ తమ పదునైన బంతులతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు చుక్కలు చూపించారు. మ్యాచ్ లో 7 వికెట్స్ కోల్పోయాక బ్యాటింగ్ కి దిగిన రాబిన్సన్ ని వచ్చి రాగానే కోహ్లి ఇతను నా షాట్ మిస్ అయినపుడు చూసి నవ్వాడు..ఇపుడు ఎలా ఆడుతాడో చూస్తా..మ్యాచ్ ని ఎలా గెలిపిస్తాడో చూస్తా అంటూ రాబిన్సన్ పై వ్యాఖ్యలు చేశాడు. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మాత్రం భారత విజయంలో కీలకపాత్ర పోషించిన షమీ, బుమ్రాలను మేము తక్కువ అంచనా వేశామని, తమ పొరపాట్ల వల్లనే మ్యాచ్ ని ఓడిపోయామని తెలిపాడు.