India Vs England 1st Test 2021: భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చిన రోహిత్ శర్మ ఔట్ అయ్యాక బ్యాటింగ్ కి దిగిన పూజారా, కోహ్లి, అజింక్య రహనే లు వెంట వెంటనే అవుట్ అయి భారత అభిమానులను నిరాశపరిచారు. ఇక మొదటి నుండి తనదైన ఆటతో రెండో రోజు చివరి వరకు నాటౌట్ గా నిలిచి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ భారత్ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ దాటికి చివరి వరకు నిలిచి మరోసారి తన సత్తా చాటాడు. ఇక ఆటకి వర్షంతో పాటు వెలుతురు సమస్య ఉండటంతో కాస్త ముందుగానే మ్యాచ్ మిగియడంతో రిషబ్ పంత్ తో గ్రీజులో ఉన్న రాహుల్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 46.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో పాటు రోహిత్ శర్మ 36 రన్స్‌తో సాధించాడు. ఇక కెప్టెన్ కోహ్లీ మొదటి బంతికే అండర్సన్ బౌలింగ్ లో డకౌట్ అయి అభిమానులను నిరాశపరిచాడు. మ్యాచ్ కి ముందు రోజు అండర్సన్ వ్యాఖ్యలకు మీ పిచ్ మీదే సమాధానం చెప్తామన్నా కోహ్లి మొదటి బంతికే అండర్సన్ బౌలింగ్ లో ఔట్ అయి తాను చెప్పిన మాటను, పేలవమైన బ్యాటింగ్ తో ఆటను తప్పాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్ 183 పరుగులకు మరో 58 పరుగుల వెనుకంజలో ఉంది. 47వ ఓవర్‌లో భారత్ 125/4 స్కోరు వద్ద వర్షంతో ఆటను నిలిపి వేశారు.
మూడోరోజు భారత్ కనీసం మూడు వందల పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్ పై కాస్త ఒత్తిడి పెరిగి మ్యాచ్ ని గెలిచే అవకాశాలు లేకపోలేదు. మూడో రోజు రాహుల్, రిషబ్ పంత్ లు మంచి భాగసౌమ్యం ఏర్పరిస్తే మూడు వందల పరుగులు భారత్ కి పెద్ద కష్టమేమి కాదని తెలుస్తుంది. తర్వాత జడేజా, శార్దుల్ ఠాకూర్ వంటి బ్యాట్స్ మెన్ లు తనదైన ఆట కనబరిచిస్తే స్కోర్ బోర్డులో ఆశించినంత పరుగులు చూడొచ్చు.