T20 World Cup: టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు చేసిన ఐసీసీ
T20 World Cup: టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు చేసింది ఐసీసీ.
T20 World Cup: టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ-20 ప్రపంచకప్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఐసీసీ యూఏఈ, ఒమన్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌లో జరగాల్సిన టోర్నీ కాస్త యూఏఈ, ఒమన్‌కు షిప్ట్ అయింది.
టోర్నీలో భాగంగా మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా టోర్నమెంట్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయని ఐసీసీ తన ట్వీట్‌లో పేర్కొంది.