IND vs ENG: సెమీఫైనల్‌లో టీమిండియా అట్టర్ ఫ్లాప్ షో..

IND vs ENG: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌లో పాక్‌ను చితక్కొట్టాల్సిన టీమిండియా అత్యంత దారుణమైన, పేలవమైన ప్రదర్శన ఇచ్చింది.

Update: 2022-11-10 12:07 GMT

IND vs ENG: సెమీఫైనల్‌లో టీమిండియా అట్టర్ ఫ్లాప్ షో..

IND vs ENG: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌లో పాక్‌ను చితక్కొట్టాల్సిన టీమిండియా అత్యంత దారుణమైన, పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. సెమీస్‌ నుంచి ఇంటిదారి పట్టింది. కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై కనీసం పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. టీమిండియన్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు. ఏ ఓవర్‌లోనూ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయలేకపోయారు. కేవలం 16 ఓవర్లలోనే భారత్ విధించిన టార్గెట్ ను ఓపెనర్లు ఛేదించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ టాపార్డర్‌ విఫలమైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 5 పరుగులు చేయగా కేప్టెన్ రోహిత్‌ శర్మ 27 రన్స్ చేశాడు. బాగా ఆడుతాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ సారి తేలిపోయాడు. 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, హార్ధిక్ పాండ్య.. హాఫ్‌ సెంచరీలు చేయడంతో టీమిండియా గౌవర ప్రదమైన స్కోర్ చేసింది. 33 బంతుల్లోనే పాండ్య 63 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లీష్ టీమ్ ఓపెనర్లు బట్లర్, హేల్‌ ఆది నుంచే అదగొట్టారు. భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. ఓవర్‌కు సుమారు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటెన్ చేస్తూ వచ్చింది. ఎక్కడా తగ్గకుండా ఓపెనర్లు హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులు చేయగా హేల్స్ 47 బాల్స్‌లో 86 పరుగులు చేశాడు. 16 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించారు. సెమీస్‌లో భారత్‌ను ఓడించిన ఇంగ్లాండ్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరింది. ఈ నెల 13 న జరగనున్న తుదిపోరులో ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. 

Tags:    

Similar News