IPL 2022: ముంబై ఇండియన్స్ జట్టు నుండి సూర్య కుమార్ ఔట్..!!

IPL 2022:ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఉన్న జట్టుల్లో ఎక్కువ సార్లు ట్రోఫీని చేజిక్కించుకున్న టీంగా నిలవడమే కాకుండా అభిమానుల

Update: 2021-07-07 13:06 GMT

సూర్య కుమార్ యాదవ్ 

IPL 2022: ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఉన్న జట్టుల్లో ఎక్కువ సార్లు ట్రోఫీని చేజిక్కించుకున్న టీంగా నిలవడమే కాకుండా అభిమానుల ఫాలోయింగ్ లోను ఈ జట్టు మొదటి స్థానంలో ఉంటుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్రాంచైజ్ చేసిన ఈ టీంలో సచిన్ టెండూల్కర్, రికి పాంటింగ్ వంటి లెజెండరి ఆటగాళ్ళు జట్టులో ఆడి ప్రస్తుతం ఆ టీంకి మెంటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కరోన నేపధ్యంలో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ 2021 ఈ ఏడాదిలోనే పూర్తి చేయడానికి భారత క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీలంక టూర్ లో ఉన్న భారత జట్టు ఆ తర్వాత ప్రపంచ కప్ లో పాల్గొననుంది. ప్రపంచ కప్ పూర్తైన కొద్ది రోజుల్లోనే యూఎఈలో ఐపీఎల్ ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రానున్న ఐపీఎల్ 2022 లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు మరో రెండు జట్టులు కలవబోతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయా టీమ్స్ లో ఉన్న ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలని ఐపీఎల్ యాజమాన్యం త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

అందులో భాగంగా ప్రతి జట్టులో నలుగురు ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకునే వీలు ఉంటుంది. ఆ నలుగు ప్లేయర్స్ లో ఇద్దరు స్వదేశీ ఆటగాళ్ళు, ఇద్దరు విదేశీ ఆటగాళ్ళు లేదా ముగ్గురు స్వదేశీ ఆటగాళ్ళు, ఒక్కరు విదేశీ ఆటగాళ్ళను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ లో అన్ని టీమ్స్ కంటే బలమైన టీంగా ఉన్న ముంబై ఈ నియమంతో కాస్త ఇబ్బంది పడబోతుందని తెలుస్తుంది. అయితే ఆ నలుగురు ఆటగాళ్ళలో రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, పోలార్డ్ లను ముంబై టీం యాజమాన్యం రిటైన్ చేసుకోనుందని సమాచారం. అయితే ఐపీఎల్ తన సత్తా చాటి భారత జట్టులో స్థానం పొందిన సూర్య కుమార్ యాదవ్ ని ముంబై యాజమాన్యం వదులుకోబోతుందని సమాచారం. ఇక ఇంత కాలం ముంబై తరపున బరిలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్ ఆ నిర్ణయంతో ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఏ జట్టు తరపున ఆడబోతున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే...!!

Tags:    

Similar News