Suresh Raina: సురేశ్ రైనా ఫిర్యాదుపై స్పందించిన సీఎం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం.
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువులపై దుండగులు దాడి చేసి అత్యంత కిరాతకంగా.. హత్య చేశారు. ఈ ఘటనపై రైనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువులపై దుండగులు దాడి చేసి అత్యంత కిరాతకంగా.. హత్య చేశారు. ఈ ఘటనపై రైనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీస్ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేసును వీలైనంత త్వరగా చేధించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల పఠాన్‌కోట్‌లోని సురేశ్ రైనా మేనత్త ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఈ కారణంతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా ఇటీవల యూఏఈ నుంచి భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సురేశ్ రైనా సోషల్ మీడియాలో స్పందించారు. ''ఆరోజు రాత్రి ఏం జరిగిందో..? ఈరోజుకి కూడా మాకు స్పష్టంగా తెలియడం లేదు. పంజాబ్ పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపాలి. ఆ దాడి ఎవరు చేశారో..? తెలుసుకునే హక్కు మాకుంది. ఆ దుండగులు ఇలాంటి దాడులు ఎక్కడా చేయకుండా చర్యలు తీసుకోవాలి'' అని పంజాబ్ పోలీస్ విభాగం, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌కి రైనా ట్యాగ్ చేశాడు. దాంతో.. రైనా ట్వీట్‌పై వెంటనే ఎస్పీ ప్రభజ్యోత్ సింగ్ స్పందించారు.