IPL 2023: ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ ఖేల్ ఖతం
IPL 2023: ఐపీఎల్-16 నుంచి సన్ రైజర్స్ నిష్క్రమణ
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే గెలవాల్సిన పోరులో సన్ రైజర్స్ బొక్క బోర్లా పడింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 189 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ 64 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు..చివర్లో భువనేశ్వర్ కుమార్ 27, మయాంక్ మార్కండే 18 పరుగులు చేశారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. మొహమ్మద్ షమీ, మోహిత్ శర్మలు చెరో 4 వికెట్లతో మెరిశారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.
కాగా నిన్నటి మ్యాచ్ లో గెలిచుంటే, సన్ రైజర్స్ కు కొన్ని అవకాశాలు ఉండేవి. ఈ ఓటమితో అవన్నీ ఆవిరయ్యాయి. సన్ రైజర్స్ ఈ టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ ల్లో గెలవడం వల్ల సన్ రైజర్స్ కు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ, ఇతర జట్ల అవకాశాలను మాత్రం ప్రభావితం చేసే అవకాశం ఉంది. అటు, తాజా విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ బెర్తు దాదాపుగా ఖరారైంది.