రూ.100 కోట్ల మార్క్ దాటిన నరేన్.. ఐపీఎల్ లో 100 కోట్లు సంపాదించిన ఆటగాళ్ళు వీళ్లే..!!
* ఐపీఎల్ సంపాదనలో టాప్ లో నిలిచిన ధోని, రోహిత్, కోహ్లి
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జట్టు తరపున అరంగేట్రం చేసిన వెస్టిండిస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో కొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నరేన్ నిలిచాడు. 2012 నుండి 2021 వరకు 10 సీజన్ లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన సునీల్ నరేన్ ని ఇటీవలే కలకత్తా టీం మెగా వేలానికి ముందే 6 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది.
ఇప్పటివరకు గత 10 సీజన్లలో కలిపి 95.6 కోట్ల రూపాయలను సంపాదించిన సునీల్ నరేన్ తాజాగా ఈ సీజన్ లో 6 కోట్లతో కలిపి 100 కోట్ల రూపాయల మార్క్ ని దాటాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన సునీల్ నరైన్ 134 మ్యాచ్‌ల్లో 958 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లో 143 వికెట్లు పడగొట్టాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 100 కోట్ల రూపాయల మార్క్ ని దాటిన టాప్ 5 ఆటగాళ్ళు
1. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని -> రూ. 152.8 కోట్లు
2. ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ -> రూ. 146.6 కోట్లు
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి -> రూ. 143.2 కోట్లు
4. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా -> రూ. 110.7 కోట్లు
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ -> రూ. 102.5 కోట్లు