T20 World Cup: 10 సెకన్లకు 30 లక్షలు.. భారత్ - పాక్ మ్యాచ్ కి రికార్డు రేటు

* దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ కి గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్ - పాక్ మ్యాచ్ టికెట్లు

Update: 2021-10-05 10:04 GMT

భారత్ - పాక్ టీ20 ప్రపంచకప్ (ఫోటో: ఐసిసి)

T20 World Cup: భారత్ - పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. దాదాపుగా రెండున్నర ఏళ్ళ తరువాత భారత్ టీ20 ప్రపంచకప్ లో అక్టోబర్ 24వ తేదీన పాకిస్తాన్ తో తలపడబోతుంది. ఐపీఎల్ పూర్తయిన మరుసటి రోజే టీ20 ప్రపంచకప్ యూఏఈ లోనే ప్రారంభంకానుంది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లను భారత్ పాకిస్తాన్ తో మొదలుపెట్టనుంది.

దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు కూడా ఆన్లైన్ లో కేవలం గంట సమయం వ్యవధిలోనే హాట్ కేకులా అమ్ముడుపోవడంతో పాటు.., మ్యాచ్ ప్రసార సమయంలో వచ్చే ప్రకటనలకు గాను ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ రికార్డు స్థాయిలో ధరని నిర్ణయించినట్లు తెలుస్తుంది. పది సెకన్ల యాడ్ కి గానూ 30 లక్షల రూపాయలను నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలోనే ఒక యాడ్ కి 30 లక్షల ధర నిర్ణయించడం ఇదే మొదటిసారి అని.., ఆ ధరకి ఒప్పుకొని కొన్ని కంపెనీలు కూడా యాడ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారని వారితో చర్చలు కూడా స్టార్ యాజమాన్యం జరుపుతుందని తెలిసింది.

మొదట ఐసిసి టీ20 ప్రపంచకప్ ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని అనుకున్న ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దుబాయ్ క్రికెట్ స్టేడియంలో 70% సీటింగ్ సామర్ధ్యంతో నిర్వహించాలనే ఆలోచనతో 18500 టికెట్లను విక్రయించింది. ఇక త్వరలో జరగబోయే దాయాదుల పోరు టీ20 ప్రపంచకప్ లోనే కాకుండా టెలివిజన్ చరిత్రలో ఎక్కువ టిఆర్పీ రేటింగ్ తో కూడా రికార్డులు సృష్టిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News