IND vs SL ODI: చివరి మ్యాచ్‌లో రాణించిన శ్రీలంక

IND vs SL ODI: భారత్‌పై మూడు వికెట్ల తేడాలో లంక విజయం * 2-1 తేడాతో గబ్బర్ సేన సిరీస్ కైవసం

Update: 2021-07-24 01:31 GMT

మూడు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం (ఫైల్ ఇమేజ్)

IND vs SL ODI: టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని లంక ఆటగాళ్లు ఈజీగా సాధించారు. ఫెర్నాండో 76, రాజపక్స 65 పరుగులతో రాణించడంతో.. శ్రీలంక 39 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రెండు వన్డేల్లో సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకుని.. క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా మూడో వన్డేలో మాత్రం ఆ స్థాయి ఆటతీరును కనబర్చలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ జట్టుకు మధ్య వర్షం అడ్డు తగిలింది. దీంతో.. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు..

భారత ఆటగాళ్లు ఓపెనర్ పృథ్వీషా 49, ధావన్ 13, సంజూశాసంన్ 46, సూర్యకుమార్ యాదవ్ 40, హార్థిక్ పాండ్యా 19, రాహుల్ చాహర్ 13, నవదీప్ సైనీ 15 పరుగులు చేసి ఔట్ కావడంతో టీమిండియా 43.1 ఓవర్లకు 225 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య చేధనకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు టీమిండియా బౌలర్ క్రిష్ణప్ప గౌతమ్ ఆదిలోనే షాకిచ్చాడు.. మినోద్ భనును ఔట్ చేసి 7 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు..

ఫెర్నాండో 76, రాజపక్స 65 పరుగులు చేసి లంక గెలుపుకు కారణం అయ్యారు. చివరల్లో రమేష్ మెండిస్, ధనంజయ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. టీమిండియాల బౌలర్లలో రాహుల్ చాహర్ కు మూడు వికెట్లు, సకారియా రెండు, క్రిష్ణప్ప గౌతమ్, హర్ధిక్ పాండ్య చెరో వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పెర్నాండోను ప్రకటించగా.. ప్లేయర్ ఆఫ‌ ది సిరీస్ ను టీమిండియా యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. 

Full View


Tags:    

Similar News