Team India: రెండో వన్డేలో టీమిండియా అద్బుత విజయం

*రెండు వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై భారత్ విజయం

Update: 2022-07-25 02:30 GMT

Team India: రెండో వన్డేలో టీమిండియా అద్బుత విజయం 

Team India: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా అద్బుత విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. చివర్లో అక్షర్ పటేల్ దంచికొట్టాడు. 35 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 2-0 తేడా టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 312 పరుగుల భారీ ఛేదనలో శుభ్ మన్ గిల్ 49 బంతుల్లో 43 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 71, సంజూ శాంసన్ 54, దీపక్ హుడా 33 పరుగులు చేశారు. చివరి పది ఓవ్రలలో జట్టు విజయానికి వంద పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ రెచ్చిపోయాడు. టెలెండర్లతో కలిసి ఆదుకున్నాడు. ప్లేయర్ అఫ్ ది మ్యాట్ అవార్డు అక్షర్ పటేల్ కు దక్కింది.

భారీ లక్ష్య చేధనతో బ్యాటింగ్ కు టీమిండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 13, శుభమన్ గిల్ తొలి పది ఓవర్లు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 11 ఓవర్ లో షెపర్డ్ బౌలింగ్ లో ధావన్ అవుట్ అయ్యాడు. 48 పరుగుల దగ్గర భారత్ తొలివికెట్ కోల్పోయింది. కాసేపటికే శుభమన్ గిల్ మేయర్స్ బౌలింగ్ లో కాట్ అండ్ బౌల్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ తొమ్మిది పరుగులకే బౌల్డ్ అయ్యాడు. భారత్ 79 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వత బ్యాటింగ్ చేపట్టిన శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 33వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అవుటయ్యాడు. క్రీజ్ లోకి వచ్చిన దీపక్ హుడా సంజూతో కలిసిన కాసేపు పోరాడు. 206 పరుగుల వద్ద సంజూ పెవిలియన బాట పట్టాడు. దీపక్, అక్షర్ పటేల్ పై మ్యాచ్ భారం పడింది. వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడి స్కోర్ పెంచి మ్యాచ్ గెలిచేందుకు సహకరించారు. 

Tags:    

Similar News