Sanjay Bangar: సహనంతో ఆడు విరాట్.. అనవసరంగా వికెట్ కోల్పోవద్దు
* భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు.
Sanjay Bangar : భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై ఆకాష్ చోప్రాకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లికి ఇంగ్లాండ్ బౌలర్స్ కు వికెట్ ని పడగొట్టటానికి ఉండే సహనం వికెట్ కోల్పోకుండా ఆడటానికి లేదని, అనవసర బంతులను ఆడుతూ వికెట్ ని కోల్పోతున్నాడని సంజయ్ బంగర్ తెలిపాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో కలిపి విరాట్ కోహ్లి కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక గత 22 నెలల్లో ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం అతని ఆట తీరుకు నిదర్శనమని వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఆఫ్ స్టంప్ కి అవతలికి వెళ్తున్న అనవసర బంతులను ఆడటం వల్లనే కోహ్లి ఔట్ అవుతున్నాడని, తన ఆట తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని సంజయ్ బంగర్ తెలిపాడు. ఇక ఇప్పటికే సెప్టెంబర్ 2న ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ లో తుది జట్టులో మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఈ మార్పులతోనైన భారత్ ఘనవిజయం సాధించి 2-1 తో సిరీస్ ని ఆధిక్యం సాధిస్తుందో లేదో చూడాల్సిందే.