క్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‎కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...

Arjun Tendulkar: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మపై క్రికెట్ అభిమానుల ఆగ్రహం...

Update: 2022-05-25 04:45 GMT

క్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‎కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...

Arjun Tendulkar: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2022 సీజన్ అరంగేట్రం కోసం వేచి చూసిన అర్జున్‌కు తన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మొండి చెయ్యి చూపించగా.. తాజాగా రంజీట్రోఫీ నాకౌట్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. జూన్‌లో జరగనున్న ఈ నాకౌట్ మ్యాచ్‌ల్లో ముంబై జట్టును పృథ్వీ షా నడిపించనున్నాడు. యశస్వీ జైస్వాల్, ధావల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే‌లకు అవకాశం దక్కింది.

ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన రంజీట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో అర్జున్ టెండూల్కర్‌తో పాటు అజింక్యా రహానేల పేర్లు ఉన్నాయి. ముంబై తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం అయితే చేయలేదు. ఇక ఐపీఎల్‌లో రహానే భుజానికి గాయం అవడంతో నాకౌట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కేవలం 30 లక్షల కనీస ధరకు తీసుకుంది.

ఈ సీజన్‌లో ముంబై దారుణంగా విఫలమవడం, వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో అర్జున్‌కు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ ముంబై మేనేజ్‌మెంట్ మాత్రం అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా చోటివ్వలేదు. దాంతో ముంబై మేనేజ్‌మెంట్, రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సర్ఫరాజ్‌ ఖాన్, అతని సోదరుడు ముషీర్‌కు చోటు దక్కింది. కూచ్ బెహార్ ట్రోఫీలో ముషీర్ అద్భుతంగా రాణించాడు. 

Full View


Tags:    

Similar News