Video: అందుకే పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నా: అసలు విషయం చెప్పేసిన రోహిత్ శర్మ

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు ICC టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడేందుకు అవకాశం లభించింది.

Update: 2024-07-02 14:30 GMT

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు ICC టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడేందుకు అవకాశం లభించింది. 2007లో అరంగేట్రంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో రోహిత్ శర్మకు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన కెప్టెన్సీలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందాన్ని అందుకున్నాడు. ఈ విజయం తర్వాత టోర్నీలో జరిగినVideo: అందుకే పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నా: అసలు విషయం చెప్పేసిన రోహిత్ శర్మ ప్రతీ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. పిచ్‌లోని మట్టిని ఎందుకు తిన్నాడో కూడా చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇలాంటి విజయాన్ని అందుకోలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చివరి ఓవర్‌లో 7 పరుగుల తేడాతో గెలిచి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను 169 పరుగులకే పరిమితం చేసింది.

ఆ క్షణంలోనే రోహిత్ పిచ్ మట్టిని ఎందుకు తిన్నాడు?

ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నేను పిచ్ దగ్గరికి వెళ్లినప్పుడు, ఆ పిచ్ మాకు చాలా ఇచ్చింది. మేం ఆ పిచ్‌లో ఆడాం. ఆ మైదానంలో మేం గెలిచాం. నా జీవితంలో ఈ మైదానాన్ని, ఆ పిచ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ పిచ్‌లో కొంత భాగాన్ని నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను. అందుకే ఇలా చేశాను. ఆ క్షణాలు నాకు చాలా ప్రత్యేకమైనవి' అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News