IPL 2023: కింగ్ కోహ్లీకి మరోసారి భారీ జరిమానా.. ఈసారి నిషేధమే..
IPL 2023: భారత్ స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు మరోసారి షాక్ ఇచ్చారు.
IPL 2023: భారత్ స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు మరోసారి షాక్ ఇచ్చారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు ఇప్పటికే రూ.12 లక్షల ఫైన్ విధించిన ఐపీఎల్ కమిటీ...రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది.
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ స్లోఓవర్ రేట్ మెయింటేన్ చేయడంతో..స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న కోహ్లీకి రూ.24లక్షల జరిమానా విధించింది. కెప్టెన్ తో పాటు జట్టు సభ్యులకు కూడా ఫైన్ వేశారు. ప్రతి ప్లేయర్ కు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25శాతం వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరు-రాజస్తాన్ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన అమిత్ శర్మ ధృవీకరించారు.
స్టాండ్ ఇన్ కెప్టెన్ గా కోహ్లీకి స్లో ఓవర్ రేట్ జరిమానా పడటం ఈ సీజన్ లో ఇదే మొదటిసారి. కానీ ఇదివరకే ఆర్సీబీ..ఒకసారి ఈ నిబంధనను ఉల్లంఘించింది. ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా బెంగళూరు ఆడిన మూడో మ్యాచ్ లో జరిమానా పడింది. రెండోసారి ఇదే తప్పు పునరావృతం అయినందుకు ఆర్సీబీ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కు అలాగే ఆటగాళ్లకు జరిమానా విధించారు. ఇదిలా ఉంటే, ఇదే తప్పు మరోసారి రిపీట్ అయితే కెప్టెన్ గా ఎవరుంటే వారి మీద ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. అలాగే ఆటగాళ్లు కూడా రూ.12 లక్షలు జరిమానాకు గురవుతారు. మొత్తంగా ఐపీఎల్ 16 సీజన్ లో కింగ్ కోహ్లీకి జరిమానా పడడం ఇది రెండోసారి.