IPL 2020: ఐపీఎల్ లో టాప్ ర్యాంకర్ ఏది?
IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న లీగ్. మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీగ్ కూడా ఐపీఎలే. ఈ క్రీడా సమరంలో అన్ని జట్ల మధ్య హోరా హోరీ పోరు సాగుతుంది
IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న లీగ్. అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీగ్ కూడా ఐపీఎలే. ఈ క్రీడా సమరంలో అన్ని జట్ల మధ్య హోరా హోరీ పోరు సాగుతుంది. ప్రతి జట్టు కూడా టైటిల్ కోసం వీరోచితంగా పోరాడుతుంది.. చివరి వరకు విన్నర్ ఎవరో చెప్పడం సాధ్యం కాదు. చివరి బంతి వరకు విజయం దాగుడు మూతలు ఆడినా మ్యాచ్‌లు ఎన్నో. ప్రారంభమైన తొలి రోజు నుంచే.. ప్రతి పాయింట్ కోసం పోటీ పడుతూ గేమ్ ఆడుతూ ఉన్నాయి. ఈ సారి ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్నది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్క టీం సాధించిన పాయింట్ల ఆధారం వారి ర్యాకింగ్స్ చూద్దాం.
రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకూ 149 పాయింట్లను సాధించి.. 8వ స్థానంలో ఉంది. ఆ తరువాత ఢిల్లీ డెయిర్ డెవిల్స్ .. వీళ్లు అన్ని సీజన్లలో.. ఇప్పటి వరకూ 155 పాయింట్లను సాధించారు. ప్రస్తుతం వీరు 7 స్థానంలో కొనసాగుతున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొత్తం మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకూ 162 పాయింట్లను సాధించింది. వీరు 6 వ స్తానంలో కొనసాగుతుంది. తరువాత స్తానంలో హైదరాబాద్ టీం డక్కన్ చార్జర్స్ ఉంది. 2008 నుంచి 2019 వరకు మొత్తం 164 పాయింట్లు సాధించారు. ప్రస్తుతం 5 వ స్థానంలో కొనసాగుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ .. ఐపీఎల్ చరిత్రలో ఈ టీం 164 పాయింట్లు సాధించి 4 వ స్థానంలో కొనసాగుతుంది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ 2009,2010 సీజన్‌లో ఈ టీం ఆడలేదు. అయిన మెరుగైన ఆటతీరులో 176 పాయింట్లను సాధించారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ అన్ని సీజన్లలో చాలా మెరుగైన ప్రదర్శనిస్తూ.. ఐపీఎల్ చరిత్రలో 176 పాయింట్లను సాధించారు. ముంబయి ఇండియన్ నాలుగు సార్లు టైటిల్ కైవసం చేసుకుని ..199 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.