Punjab Kings: మాకు ఎవ్వరూ వద్దు.. ఆటగాళ్ళకు షాక్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం

ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి.

Update: 2021-11-28 07:35 GMT

Punjab Kings: మాకు ఎవ్వరూ వద్దు.. ఆటగాళ్ళకు షాక్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం

Punjab Kings: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ లో కొత్తగా ఎనిమిది జట్లకు తోడు మరో రెండు జట్లు రావడంతో ఐపీఎల్ మెగా వేలం కచ్చితమైంది. ఇప్పటికే బిసిసిఐ ఆయా ఫ్రాంచైజీలకు నవంబర్ 30 లోపు రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలని చెప్పింది. బీసీసీఐ రూపొందించిన రిటైన్ రూల్స్ ప్రకారం ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే టీంలో ఉంచుకునే అవకాశం ఉంది.

ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. నలుగురిని రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 12 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ.6 కోట్లు చెల్లించాలి. ఇలా జరిగితే ఫ్రాంచైజీలు తమ రూ.90 కోట్ల నుండి రూ.42 కోట్లు ఆ నలుగురి ఆటగాళ్లకే వెచ్చించాల్సి ఉంటుంది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం మాత్రం ఏ ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోవడానికి సిద్దంగా లేనట్టు తెలుస్తుంది.

గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో కొనసాగుతూ వస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు పేరు మార్చిన జట్టు కెప్టెన్ లను మార్చిన జట్టు విజయాల్లో మాత్రం వెనుకంజలో ఉండటంతో ఈ ఏడాది ఏ ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోకుండా 90 కోట్ల పూర్తి పర్స్ వాల్యూతో మెగా వేలానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News