PAK vs SA: అతన్ని వదలిపెట్టండి.. నాదే తప్పు!

PAK vs SA: పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో ఫకర్‌ జమాన్‌ (193) డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో ఔటైన విషయం తెలిసిందే.

Update: 2021-04-05 10:42 GMT
PAK VS SA

PAK vs SA: పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌ (193) డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో వివాదాస్పద రీతిలో ఔటైన విషయం తెలిసిందే. దీనిపై సౌతాప్రికా కీపర్ క్వింటన్‌ డికాక్‌ తీరుపై పెద్దెఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జమాన్‌ స్పందిస్తూ.. అందులో తన తప్పే ఉందని, క్వింటన్‌ డికాక్‌ తప్పు ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు.

మ్యాచ్‌ అనంతరం జమాన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న హ‌రీస్ ర‌వూఫ్ వైపు చూస్తున్నానని తెలిపాడు. చివరి ఓవర్‌లో పాక్‌ 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్ ‌(192) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మరో ఎండ్‌లో హారిస్‌ రౌఫ్‌ (1) ఉన్నాడు. అయితే ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్‌ రన్‌ తీయబోయిన జమాన్‌ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో రనౌటయ్యాడు. ఫీల్డర్‌ మార్‌క్రమ్‌ డైరెక్ట్‌ త్రో విసరడంతో అతడు ఔటయ్యాడు. ఫీల్డర్‌ బంతిని నాన్‌స్ట్రైకర్‌ వైపు విసురుతున్నట్లు చేయి ఊపడం, అప్పుడే జమాన్‌ అవతలి వైపు చూడటం, బంతి వికెట్లకు తాకడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి.

ఇక్కడే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. డికాక్‌ ఉద్దేశపూర్వకంగా అలా చేశాడని, జమాన్‌ వన్డేల్లో రెండో ద్విశతకం సాధించకుండా చేశాడని మండిపడుతున్నారు. డికాక్‌ చేసింది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాక్ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం అన్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన జమాన్‌ తన రనౌట్‌ విషయంలో తప్పు తనదేనని ఒప్పుకున్నాడు.

బుధవారం పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ తొలుత బ్యాటింగ్‌ చేసి 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగులు‌ చేసింది. డికాక్ ‌(80), కెప్టెన్‌ బవుమా (92), వాండర్‌ డసెన్ ‌(60), మిల్లర్ ‌(50) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో పాక్‌ 9 వికెట్ల నష్టానికి 324 స్కోర్‌ చేసి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. క్వింటన్‌ డికాక్‌ తప్పు ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. మా జట్టు విజయం సాధించి ఉంటే ఇంకా బాగుండేది' అని ఫకర్‌ జమాన్‌ అన్నాడు.



Tags:    

Similar News