ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో నీరజ్ చోప్రాకు సిల్వర్ పతకం

Neeraj Chopra: జావెలిన్‌త్రో లో నీరజ్ చోప్రాకు సిల్వర్ పతకం

Update: 2022-07-24 04:53 GMT

ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో నీరజ్ చోప్రాకు సిల్వర్ పతకం

Neeraj Chopra: అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఒలిపింక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్నాడు. గ్రూప్- ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఇటీవల స్టాక్‌ హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డ్ సృష్టించిన నీరజ్ 90 మీటర్ల దూరానికి 6 సెంటీమీటర్లత దూరంలో నిలిచాడు. తాజాగా నేడు జరిగిన ఫైనల్‌లో 88.13 మీటర్లు దూరం విసిరి.. పతకాన్ని సాధించాడు. 2009 తర్వాత ఒలంపింక్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాలు రెండింటినీ గెలుచుకున్న అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు.

Full View


Tags:    

Similar News