Lockie Ferguson: కివీస్ కి షాక్.. టీ20 ప్రపంచకప్ నుండి లాకీ ఫెర్గూసన్ అవుట్
* కుడి కాలి ఫ్రాక్చర్ తో టీ20 ప్రపంచకప్ కు దూరమైన లాకి ఫెర్గూసన్
Lockie Ferguson: పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలయిన టీమిండియా - న్యూజిలాండ్ జట్లు అక్టోబర్ 31న అమీతుమి తేల్చుకోనున్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ముందుకు సాగాలంటే రెండు జట్లకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. టీమిండియాను ఎదుర్కొనడానికి సిద్దమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు తాజాగా అనుకోని షాక్ తగిలింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఆటగాడు లాకీ ఫెర్గూసన్ గాయపడి టీమిండియాతో జరిగే మ్యాచ్‌కే కాకుండా టీ20 ప్రపంచకప్ 2021 మొత్తానికీ దూరం అయ్యాడు.
అతని కుడి కాలికి చిన్న ఫ్రాక్చర్ ఏర్పడింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అతను కాలినొప్పితో అందుబాటులో లేడు. తాజాగా లాకీ ఫెర్గూసన్ కు ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా ఫ్రాక్చర్‌గా తేలింది. దీనితో అతనికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆడమ్ మిల్నెను ఫెర్గూసన్ స్థానంలో జట్టులోకి తీసుకునే అవకాశం ఇవ్వాలని కివీస్ క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెక్నికల్ కమిటీకి దరఖాస్తు చేసుకుంది.
ఇక స్టార్ ప్లేయర్ మ్యాచ్ కి దూరమవడంతో కివీస్ జట్టు కివీస్ కి ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మంగళవారం జరిగిన మ్యాచ్ లో 16 ఓవర్ల వరకు కూడా గెలుపుపై ధీమాగా కివీస్ జట్టుకు పాకిస్తాన్ ఆటగాడు ఆసిఫ్ క్రీజులోకి వచ్చి వరుస సిక్సులతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి పాకిస్తాన్ జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. దీంతో నాలుగు పాయింట్లతో గ్రూప్ 2 లో పాకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది.