Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం

Neeraj Chopra: బుడాపెస్ట్ అథ్లెటిక్స్ పోటీల్లో చారిత్రక చోప్రా చారిత్రక రికార్డ్

Update: 2023-08-28 02:01 GMT

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం

Neeraj Chopra: జావెలిన్ త్రోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌గా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి ప్రపంచ విజేతగా నిలిచాడు. ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో ప్రత్యర్థులను వెనుక్కి నెట్టి సాధికార ప్రతిభతో ప్రపంచ ఛాంపియన్‌గా నిలచి కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బుడాపెస్ట్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారుపతకాన్ని సాధించి దేశాన్ని గర్వించే స్థాయికి తీసుకెళ్లిన నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. నీరజ్ చోప్రా ప్రతిభను ప్రశంసిస్తూ... ప్రధాని మోదీ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేశారు.

ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌ క్వాలిఫయర్‌లో రికార్డు స్థాయిలో త్రో చేశాడు నీరజ్ చోప్రా. 12 మంది బరిలో ఉన్న క్వాలిఫయర్స్‌లో 88.77 మీటర్ల దూరం జావెలిన్ విసిరి సహపోటీదారుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించడానికి 83 మీటర్ల దూరం విసరాల్సి ఉండగా.. మరో 5.7 మీటర్ల దూరం అధికంగా ఫైనల్ విసిరి విజేతగా నిలిచాడు. అంతేకాదు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత ప్రమాణాన్ని కూడా దాటేసిన చోప్రా.... ఒలింపిక్స్‌లోనూ బెర్త్ ఫిక్స్ చేసుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈటెను 87.58 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని ముద్దాడాడు నీరజ్ చోప్రా. భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడల్లోనూ నీరజ్ పసిడి సాధించాడు. గత టోర్నీలో అడుగు దూరంలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్న నీరజ్ చోప్రా.. ఈసారి ఫైనల్లో అనుకున్నది సాధించాడు. స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News