ప్రజాప్రతినిధులకు తొలివిడతలోనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి.. ప్రధానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరో్నా వ్యాక్సిన్ పంపణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే
ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరో్నా వ్యాక్సిన్ పంపణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్ వచ్చాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైరన్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణరాజు భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా టీకా ప్రజాప్రతినిధులు ముందుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందువరుస వున్న కరోనా వారియర్స్ తో పాటు , ఎంపీలు , ఎమ్మెల్యేలకు కూడా వ్యాక్సిన్ అందజేయాలని కోరారు.
కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక. దేశం మొత్తానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. ముంబయి, కోల్ కతా, చెన్నై, కర్నాల్ ప్రాంతాల్లో ఈ స్టోరేజి కేంద్రాలు నెలకొల్పనున్నారు. తదనంతర దశలో దేశవ్యాప్తంగా 37 స్టోరేజి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో మొదట వైద్య సిబ్బందికి ఆ తర్వాత వివిధ శాఖల్లో పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అందించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముందుగా.. మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు ఇవ్వనున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్యకార్మికు ప్రజలకు సేవలందించారు. దీంతో వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. భారత్‌లో ఇటీవల కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇచ్చి ఏదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కూడా వైద్యం అందించడానికి అన్ని చోట్లా డాక్టర్స్‌ను ఏర్పాటు చేశారు. అందరి కోసం పని చేశామని.. ఇప్పుడు ముందుండి వ్యాక్సిన్ తీసుకుంటామని తెలిపారు. కాస్త భయం ఉన్నా ప్రజల్లో ఉన్న ఆందోళన తొలగించడానికి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చామంటున్నారు.