Team India: చెత్త ప్రదర్శన.. కట్‌చేస్తే.. BGTలో చోటు దక్కించుకున్న ముగ్గురు లక్కీ ప్లేయర్స్
Team India squad for Australia Tour: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో, టీమిండియా వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు జట్ల మధ్య 4 టెస్ట్‌లకు బదులుగా ఈసారి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.
టెస్టు క్రికెట్‌లో ఈ అతిపెద్ద పోరులో భారత జట్టుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ పర్యటన కోసం రోహిత్ శర్మ సేన 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. స్క్వాడ్‌లో కొన్ని పేర్లు ఉన్నాయి. వీరి ఎంపిక ఆశ్చర్యకరంగా ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జట్టులో ఎంపికైన ముగ్గురు భారత ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3. మహ్మద్ సిరాజ్..
భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో చాలా పరిణితి చెందిన బౌలర్‌గా మారాడు. సిరాజ్ తన బౌలింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన ముద్ర వేశాడు. కానీ, ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో అతని ప్రదర్శన ఆశించినంతగా లేదు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు 30 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 80 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో, అతను ముఖ్యంగా దేశవాళీ టెస్ట్ మ్యాచ్‌లలో నిరాశపరిచాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సిరాజ్ పేరు ఎంపిక చేశారంటే అది అతడి అదృష్టమే అని చెప్పొచ్చు.
2. నితీష్ రెడ్డి..
బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి మంచి ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత టీమిండియా టీ20 జట్టులో చోటు సంపాదించడంలో సక్సెస్ అయ్యాడు. నితీష్ ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆల్ రౌండర్‌గా చేరాడు. నితీష్ ఇంకా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయలేదు. నితీష్ 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 21.45 సగటుతో 708 పరుగులు చేసి బౌలింగ్‌లో 55 వికెట్లు పడగొట్టాడు.
1. ప్రసిద్ధ్ కృష్ణ..
కర్నాటకకు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ చాలా ప్రతిభావంతుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని ఎంపిక అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. కృష్ణ ఫస్ట్ క్లాస్ కెరీర్ అంతగా ఆకట్టుకోలేదు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి లభించిన అవకాశాలలో అతను అద్భుతాలు కూడా ఏం చేయలేదు. అతను ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే అతను 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 65 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.