Eden Gardens used as Quarantine center in kolkatta : క్వారంటైన్ సెంటర్ గా ఈడెన్ గార్డెన్!
Eden gardens used as quarantine center in kolkatta : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
Eden Gardens used as Quarantine center in kolkatta : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంచం ఆశాజనకంగా కనిపిస్తుంది.. ఇక పచ్చిమ్ బెంగాల్ లో కూడా కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దీంతో హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్ల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్ల కొరత ఏర్పడింది.
దీనితో ఆ రాష్ట్రంలో అతి పెద్ద స్టేడియం అయిన ఈడెన్ గార్డెన్ ని క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని దిది ప్రభుత్వం ఆలోచనలో ఉంది.. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.. అయితే దీనికి అనుమతి ఇవ్వాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ను కలకత్తా పోలీసులు కోరారు.. అంతేకాకుండా కోల్‌కతా కమిషనర్ ఆఫ్ పోలీస్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియాకు శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన కరోనా బారిన పడిన పోలీసుల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసుకుంటామని, దీనికోసం స్టేడియం లోని కొన్ని బ్లాకులను మరియ వంటగదిని ఇవ్వాలని కోరారు.. ఇక అటు ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 25వేల మార్క్ ని దాటింది..కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కంటెయిన్మెంట్ జోన్లలో మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్ విధించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి .. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 27,114 కేసులు నమోదు కాగా, 519 మంది ప్రాణాలు విడిచారు. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 8,20,916 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,83,407 ఉండగా, 5,15,385 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 22,123 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.