IPL 2023: తప్పక గెలిస్తేనే ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలిచే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను వారి సొంతగడ్డపై అడ్డుకున్న నైట్‌రైడర్స్ తర్వాత లక్ష్యఛేదనలో తడబడినా... కెప్టెన్ నితీశ్ రాణా , రింకూ సింగ్ అర్ధ సెంచరీల పోరాటంతో నెగ్గింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోనేందుకు CSK టాపార్డర్ బ్యాటర్స్ ఇబ్బందిపడ్డారు. హిట్టర్ శివమ్ దూబే ఒక్కడే 48 పరుగులతో రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో..నరైన్, వరుణ్ చెరో 2 వికెట్లు తీయగా.. వైభవం అరోరా, శార్దూరూల్ చెరో వికెట్ పడగొట్టారు..
చెన్నై నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. దీపక్ చాహర్ ధాటికి మొదటి ఐదు ఓవర్లలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.. అయితే కెప్టెన్ నితీశ్ రాణా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రింకూ సింగ్ నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించి కేకేఆర్‌కు విజయాన్ని అందించారు.