KL Rahul: తగ్గేదేలే.. ఎవరిని ఏమన్నా మేము 11మంది వస్తాం

Update: 2021-08-17 09:30 GMT

టీం ఇండియా (ట్విట్టర్ ఫోటో)

Team India: భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఎవరు ఊహించని విధంగా ఘన విజయం సాధించి భారత అభిమానులకు ఒకరోజు ఆలస్యంగానైన ఆగష్టు 16న అదిరిపోయే బహుమతి ఇచ్చారు. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదటి రోజు నుండి ఆటగాళ్ళ మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరగడం, ఐదో రోజు వరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు జరగడం చివరికి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో భారత క్రీడా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఐదో రోజు భారత్ ఆశలన్నీ రిషబ్ పంత్ పై పెట్టుకోవడం.., రిషబ్ క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే అవుట్ అవడంతో దాదాపుగా మ్యాచ్ పై ఆశలు వదులుకున్న భారత అభిమానుల ఆశలకు ఆయువు పోస్తూ బ్యాటింగ్ చేసిన షమీ, బుమ్రాలు మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

చివర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లను వరుసగా పెవిలియన్ పంపి కేవలం 120 పరుగులకే ఆలౌట్ చేసి భారత బౌలర్స్ సిరాజ్, బుమ్రా, ఇషాంత్ శర్మలు తమ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ని చావు దెబ్బకొట్టారు. ఇంగ్లాండ్ అభిమానులు రాహుల్ పై బీర్ బాటిల్స్ వేయడం, బుమ్రాని బ్యాటింగ్ చేస్తున్నపుడు మార్క్ వుడ్ స్లెడ్జ్ చేయడం, ఆకాష్ చోప్రా ఇండియా ఓటమి పాలవుతుందని చెప్పడం, మైకేల్ వాన్ ట్వీట్ లతో భారత్ జట్టును రెచ్చగోట్టడం వంటి సంఘటనల తరువాత ఐదో రోజు మ్యాచ్ లో మంచి టార్గెట్ ని ఇంగ్లాండ్ ముందుంచిన టీమిండియా వారి బ్యాట్స్ మెన్ లను భారత ఆటగాళ్ళు కాస్త కవ్వించి తగ్గేదేలే అన్నట్టు అభిమానులకు కాస్త కిక్ ఇచ్చారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్ తాము ఇంగ్లాండ్ ఆటగాళ్ళ పరిహసాలను పట్టించుకోమని.., ఒకవేళ తమ ఆటగాడి వద్దకి ఎవరైనా వస్తే మాత్రం మిగిలిన 10 మంది వస్తాం అంటూ ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Tags:    

Similar News