IPL 2021 MI vs CSK: ఉతికి ఆరేసిన పోలార్డ్
IPL 2021 MI vs CSK: ముంబైతో జరుగిన మ్యాచ్‌లో సీఎస్‌కే అనుహ్య ఓటమిని చవిచూసింది.
IPL 2021 MI vs CSK: పొలార్డ్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు ఆశలు గల్లంతయ్యాయి. సిక్సర్లతో దుమ్ము రేపిన పొలార్డ్ కు పాండ్యా హిట్టింగ్ తోడవటంతో.. ఓడిపోతారనుకునే మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలుచుకుని కాలరెగరేసింది. ముంబైతో జరుగిన మ్యాచ్‌లో సీఎస్‌కే అనుహ్య ఓటమిని చవిచూసింది. ఢిల్లీ వేదికగా ముంబై,చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు.
రోహిత్,డికాక్ అచుతూచి ఆడడంతో ముంబై 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. మంచి ఊపు మీద కనిపించిన రోహిత్ శార్దూల్ ఠాకూర్ వేసిన 8 ఓవర్ నాల్గవ బంతికి బౌండరీలైన్ సమీపంలో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో ముంబయి కెప్టెన్ రోహిత్ 35(24బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్) పెవిలియన్‌కు చేరాడు. అంతలోనే ముంబయికి మరో షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్‌శర్మ ఔటైన కాసేపటికే సూర్యకుమార్ కూడా ఔటయ్యాడు. జడేజా వేసిన 9వ ఓవర్‌లో 4వ బంతిని సూర్య షాట్ ఆడబోయి వికెట్‌కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డికాక్ (38) కూడా ఔటయ్యాడు.
మొయిన్ అలీ వేసిన ఓవర్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక 10 ఓవర్లకు ముంబయి 81/3 పరుగులు. ఆ తర్వాత వచ్చిన పొలార్డ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జడేజా వేసిన 13 ఓవర్‌లో మొదటి బంతికి సింగిల్ తీసిన పొలార్డ్ తర్వాత మూడు సిక్సులు బాదాడు. తర్వాత కృనాల్ పాండ్యా కూడా తన బ్యాట్ ఝళీపించాడు. హిట్టింగ్ ఆడే క్రమంలో సామ్ కరన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి పొలార్డ్ తన సునామి బ్యాటింగ్‌ను అపలేదు.
చివరిలో పాండ్యా కూడా హిట్టింగ్ ఆడాడు. సమ్ కరన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన పాండ్యా.. మరో భారీ షాట్ ఆడబోయి డుప్లిసిస్‌కు చిక్కాడు. ఆఖరి ఓవర్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒక ఓవర్లో 16 పరుగులు కొట్టాల్సి ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచినట్లే ఫీలయ్యారు. కాని అక్కడ పొలార్డ్ ఉండటంతో లోపల డౌట్ పడ్డారు. వారి అనుమానాలను నిజం చేస్తూ పొలార్డ్ 16 పరుగులు కొట్టి.. ముంబై ఇండియన్స్ ను విజయతీరానికి చేర్చాడు.