ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సారథ్య బాధ్యతల నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించింది. డేవిడ్ వార్నర్ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథిగా నియమించింది. తాజా సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ కేవలం ఒకే 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక స్లో బ్యాటింగ్‌తో నిరాశపరిచిన డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.