IPL 2020: నా కోపానికి అదే కారణం: గేల్
IPL 2020: ఐపీఎల్ 2020 ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నది. లీగ్ దశ ముగుస్తున్న నేపథ్యంలో అన్ని మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లను చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగలేదు.
IPL 2020: ఐపీఎల్ 2020 ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నది. లీగ్ దశ ముగుస్తున్న నేపథ్యంలో అన్ని మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లను చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగలేదు. ఒకే మ్యాచులో రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య సాగిన ఉత్కంఠ పోరులో విజయం దాగుడుమూతలు ఆడింది. చివరకు రాహుల్ సేన రెండో సూపర్ ఓవర్లో విజేతగా నిలిచింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో .. ఫలితం తేలేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. బుమ్రా ధాటికి కేవలం 5 పరుగులే చేయగలిగితే.. ఆ తర్వాత మొహమ్మద్ షమీ ధాటికి ముంబై కూడా సరిగ్గా అవే పరుగులు చేసింది. మరో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఈ సారి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై కీరన్ పొలార్డ్ ధాటిగా ఆడటంతో 11 పరుగులు చేసింది. పంజాబ్ బాస్ క్రిస్ గేల్, మయాంక్‌లు విజృంభించడంతో రెండు బంతులు మిగిలి ఉండగానే.. గెలుపొందారు.
అయితే, రెండో సూపర్ ఓవర్ సమయంలో క్రిస్ గేల్ కోపంగా కనిపించాడు. తానేమీ ఆందోళనకు చెందలేదని, క్రికెట్‌లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నాడు. అనంతరం ఆ కోపానికి గల కారణాన్ని గేల్ తెలిపాడు. 'రెండో సూపర్ ఓవర్ ముందు నేను, మయాంక్ మాట్లాడుకున్నాం. తొలి బంతిని మనిద్దరిలో ఎవరం ఎదుర్కొందాం? అని మయాంక్ నన్ను అడిగాడు. ఆ ప్రశ్నకు నేను చాలా కలత చెందాను' అని గేల్ తెలిపాడు. 'మయాంక్ నువ్వు నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నావా?.. ఫస్ట్ బాల్‌ను బాస్ ఎదుర్కొంటాడు' అని తాను సమాధానమిచ్చాడని గేల్ చెప్పుకొచ్చాడు. అలా అనడమే కాదు తొలి బంతికే బాస్ సిక్స్ కూడాబాదాడు.
మరొకవైపు షమీపై ప్రశంసలు కురిపించాడు గేల్. 'నా వరకు షమీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రోహిత్, డికాక్‌లకు బౌలింగ్ చేసిన షమీ.. ఆరు పరుగులు కూడా చేయకుండా సమర్థవంతంగా వ్యవహరించాడు. షమీ వేసి యార్కర్లను నేను నెట్స్‌లో ఎదుర్కొన్నాను. ప్రత్యర్థులకు కూడా షమీ యార్కర్లను రుచి చూపిస్తాడని తెలుసు. నేను అనుకున్నట్టే షమీ బౌలింగ్ చేశాడు' అని గేల్ కొనియాడాడు.