IPL Broadcasting Rights: హాట్ హాట్‌గా ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం
IPL Broadcasting Rights: శాటిలైట్, డిటిజల్ ప్రసార హక్కుల కోసం 4 ఛానల్స్ మధ్య పోటీ
IPL Broadcasting Rights: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఐపీఎల్ ప్రసార హక్కుల ఈ-వేలం కొనసాగుతోంది. 2023 నుంచి 2027 వరకు మొత్తం ఐదేళ్లకు ఐపీఎల్ మ్యాచుల శాటిలైట్, డిటిజల్ ప్రసార హక్కుల కోసం వేలం జరుగుతోంది. ఈ వేలంలో రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్‌వర్క్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.
ఐపీఎల్ ఐదు సీజన్‌లకు సంబంధించి ప్రతి సీజన్‌లో 74 మ్యాచ్‌లకు కలిపి వేలం కొనసాగుతోంది.నాలుగు ప్యాకేజీలుగా ప్రసార హక్కుల వేలం జరుగుతుండగా ప్యాకేజ్-ఏలో ఇండియాలో టెలివిజన్ హక్కులు, ప్యాకేజీ-బిలో ఇండియాలో డిజిటల్ ప్రసార హక్కులు, ప్యాకేజీ-సీలో నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచులకు సంబంధించి హక్కులు, ప్యాకేజీ-డీలో ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్, డిజిటల్ హక్కులు లభించనున్నాయి.