David Warner: కారణం చెప్పకుండానే కెప్టెన్సీ నుండి తొలగించారు

* హైదరాబాద్ టీం కెప్టెన్ గా కారణం చెప్పకుండానే తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్

Update: 2021-10-13 09:30 GMT

డేవిడ్ వార్నర్ (ఫోటో: ఐపీఎల్)

David Warner: ఐపీఎల్ 2021లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం మూడు మ్యాచ్ లలో గెలిచి పాయింట్స్ టేబుల్ లో చిట్టచివరి స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. జట్టు సభ్యులను మార్చడంతో పాటు చివరికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ ని సైతం పక్కనపెట్టిన కూడా ఓటమిలలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అదే పంథాలో సాగి అభిమానులను తీవ్ర నిరాశకి గురి చేసింది.

ఈ ఏడాది సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్ గా మొదలై చివరికి డగౌట్ లో కూడా చోటులేని పరిస్థితి డేవిడ్ వార్నర్ ని తీవ్రంగా కలిచివేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన బాధని అభిమానులతో పంచుకున్నాడు వార్నర్. అసలు తనని కెప్టెన్ గా ఎందుకు తొలగించారో కూడా చెప్పలేదని, హైదరాబాద్ టీం యాజమాన్యం బేలిస్ తో పాటు లక్ష్మన్, ముత్తయ్య మురళీధరన్ అంటే తనకి గౌరవం ఉందని వీరంతా కలిసే ఆ నిర్ణయం తీసుకున్నారని, కాని నాకు ఆ కారణాన్ని కూడా చెప్పకపోవడం ఎంతో బాధని కలిగించిందని చెప్పుకొచ్చాడు.

ఆస్త్రేలియా తరువాత హైదరాబాద్ నా రెండో పుట్టినిల్లు లాంటిదని వచ్చే ఏడాది కూడా హైదరాబాద్ జట్టు తరపునే ఆడాలని ఉందని కాని ఆ నిర్ణయం హైదరాబాద్ జట్టు యాజమాన్యం చేతిలో ఉందని తెలిపాడు. అయితే ఇప్పటికే రానున్న ఐపీఎల్ లో కొత్తగా మరో రెండు జట్లు చేరుతుండటంతో మెగా వేలంలో డేవిడ్ వార్నర్ ని ఎవరు ఎంత మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసి సొంతం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే వార్నర్ ను అటు బెంగుళూరు జట్టు పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News