IPL 2025: మీరు ఐపీఎల్ టీం కొనుగోలు చేయాలని చూస్తున్నారా..ఏం చేయాలంటే ?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.

Update: 2025-03-18 15:21 GMT
IPL 2025

IPL 2025: మీరు ఐపీఎల్ టీం కొనుగోలు చేయాలని చూస్తున్నారా..ఏం చేయాలంటే ?

  • whatsapp icon

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన టోర్నమెంట్. ఇందులో పాల్గొనే జట్ల ఖర్చు వేల కోట్ల రూపాయలు. ఈ జట్లను కొనుగోలు చేయడానికి పెద్ద కంపెనీలు బిడ్డింగ్ చేశాయి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఐపీఎల్‌లో వేలం వేయబడుతున్న జట్లను ఎవరైనా కొనుగోలు చేయవచ్చా ? వేలం ఎక్కడ జరుగుతుంది.. జట్టును కొనుగోలు చేయాలంటే ఎంత డబ్బు కావాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రికెట్‌లో అత్యంత ఖరీదైన టోర్నమెంట్ అయిన ఐపీఎల్‌లో 10 జట్లు ఆడతాయి. ఈ జట్లను కొనుగోలు చేయాలంటే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. దీని పద్ధతి కాస్త స్పెషల్ గా ఉంటుంది. ఐపీఎల్‌లో కొత్త జట్టు ఏర్పడినప్పుడల్లా లేదా జట్టు యజమాని మారినప్పుడల్లా వేలం నిర్వహిస్తారు. ఈ వేలం తరచుగా ముంబై లేదా ఢిల్లీలో జరుగుతుంది. దీనిలో పెద్ద ఇన్వెస్టర్లు, కంపెనీలు బిడ్స్ వేస్తాయి. అత్యధిక బిడ్ వేసిన వ్యక్తి లేదా కంపెనీ యాజమాన్య హక్కులను పొందుతారు.

ఐపీఎల్‌లో జట్టును కొనుగోలు చేయడానికి వేలంలో పాల్గొనడానికి ఇన్వెస్టర్లు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ సమయంలో మీ దగ్గర డబ్బులున్నట్లు ఆర్థిక స్థితిని చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు జట్టును నిర్వహించగలరా లేదా అని BCCI నిర్ణయిస్తుంది. దీని తర్వాత మాత్రమే మీరు వేలంలో పాల్గొనడానికి అనుమతి పొందుతారు. ఐపీఎల్ జట్టును నడపడానికి చాలా డబ్బు అవసరం. దీనికోసం కనీసం రూ. 1500 కోట్ల ప్రారంభ పెట్టుబడి అవసరం కావచ్చు మీరు ముంబై లేదా చెన్నై వంటి విజయవంతమైన జట్లకు బిడ్డింగ్ చేస్తుంటే మీ జేబులో రూ. 5000 నుండి 6000 కోట్లు ఉండాలి.

Tags:    

Similar News