IPL 2021 SRH vs DC: ఢిల్లీ జోరు ముందు హైదరాబాద్ నిలిచేనా..?

IPL 2021 SRH vs DC: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (ఆదివారం) రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.

Update: 2021-04-25 11:09 GMT
సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 SRH vs DC: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు (ఆదివారం) రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది.

ముఖాముఖీ పోరాటాలు

ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 18 మ్యాచ్‌ల్లో ఢీకొన్నాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలుపొందింది. 7 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ తన సత్తాను చాటడంలో విఫలమవుతోంది.

టీంల బలాబాలాలు

సన్ రైజర్స్ హైదరాబాద్

హైదరాబాద్ టీంలో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ నుంచే బాదుడు మొదలుపెడుతున్న బెయిర్‌స్టో కి తోడుగా కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ కూడా ఆకట్టుకుంటున్నాడు. కేన్ విలియమ్సన్ చేరికతో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కొరత తీరింది. విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్ తమ బ్యాట్ కు పదును పెట్టాలని టీం కోరుకుంటుంది.

ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ రాణిస్తున్నా... వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. రషీద్ ఖాన్ మాత్రం ప్రత్యర్థతను కోలుకోనివ్వకుండా చూస్తున్నాడు. ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్, విజయ్ శంకర్ అడపాదపడపా రాణిస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ సూపర్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. పృథ్వీ షా మాత్రం దూకుడుగా ఆడుతున్నా... ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోతున్నాడు. స్టీవ్‌స్మిత్, లలిత్ యాదవ్, రిషబ్ పంత్, సిమ్రాన్ హిట్‌మెయర్‌, మార్కస్ స్టాయినిస్‌తో మిడిలార్డర్‌ బలంగా తయారైంది.

బౌలింగ్‌లో అమిత్ మిశ్రా, కగిసో రబాడ, అవేష్ ఖాన్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. స్టాయినిస్, లలిత్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే.. స్పిన్నర్ అశ్విన్ మాత్రం ధారళంగా పరుగులిస్తూ.. విఫలమవుతున్నాడు. కాగా, అశ్విన్ స్థానంలో స్పిన్నర్ ప్రవీణ్ దుబెని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (కీపర్), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్

Tags:    

Similar News