IPL 2021 SRH vs RCB: హైదరాబాద్ లక్ష్యం 150; బౌలర్ల ధాటికి కుప్పకూలిన బెంగళూరు టీం

IPL 2021 SRH vs RCB: ఐపీఎల్ 2021 సీజన్ లో 6 వ మ్యాచ్ లో భాగంగా నేడు బెంగళూరు - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి.

Update: 2021-04-14 16:00 GMT

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ లో ఫొటోలు

IPL 2021 SRH vs RCB: ఐపీఎల్ 2021 సీజన్ లో 6 వ మ్యాచ్ లో భాగంగా నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. కోహ్లీ సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీం 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేసింది. ఆర్‌సీబీ టీంలో మ్యాక్స్ ‌వెల్ (59 పరుగులు, 41 బంతులు, 5ఫోర్లు, 3 సిక్సులు) ఒక్కడే రాణించాడు. మిగతా వారంతా పెవిలియన్ కు క్యూ కట్టారు.

గత మ్యాచ్‌కు దూరమైన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈ మ్యాచ్‌లో రజత్‌ పటిదార్‌ స్థానంలో బరిలోకి దిగాడు. విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ గా దేవ్‌దత్ పడిక్కల్ వచ్చాడు. లీగ్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌(13 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. భువనేశ్వర్‌ వేసిన 3వ ఓవర్‌లో మిడ్‌ వికెట్‌లో షాబాజ్‌‌ నదీమ్‌ అద్భుతమైన లో క్యాచ్‌ తో పెవిలియన్‌ చేరాడు. తొలి వికెట్‌ కోల్పోయాక ఆర్‌సీబీ ఆచితూచి ఆడింది. పడిక్కల్‌ అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన షాబాజ్‌ అహ్మద్ వచ్చి రాగానే అద్భుతమైన సిక్సర్‌ బాదాడు. ఇక కెప్టెన్‌ విరాట్ సింగల్స్‌ తీస్తూ స్ట్రయికింగ్ రొటేట్‌ చేశాడు. కానీ, అంతలోనే మరో వికెట్ కోల్సియింది ఆర్‌సీబీ.


ఎస్‌ఆర్‌హెచ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ బౌలింగ్‌లో షాబాజ్‌ అహ్మద్‌(10 బంతుల్లో 14; సిక్స్‌) రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ అందించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.విరాట్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్ పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. క్రీజులో కుదుకున్నాక మ్యాక్స్ వెల్ షాబాజ్‌ నదీమ్‌ వేసిన 11వ ఓవర్‌లో గేర్ మార్చాడు. వరుసగా 6,4,6 లతో బౌండరీలు సాధించాడు. మ్యాచ్ ఆర్‌సీబీ వైపు మళ్లుతుందనుకున్నటైంలో కెప్టెన్‌ కోహ్లి(29 బంతుల్లో 33; 4 ఫోర్లు).. హోల్డర్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ అద్భుతమైన క్యాచ్‌ తో ఔటయ్యాడు.

కోహ్లీ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ కూడా ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. 13వ ఓవర్‌ తొలి బంతికి కెప్టెన్‌ కోహ్లి వికెట్‌ను కోల్పోయిన ఆర్‌సీబీ, ఆ మరుసటి ఓవర్‌ నాలుగో బంతికే డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌(5 బంతుల్లో 1) వికెట్‌ను కూడా చేజార్చుకుని కష్టాల్లో పడింది.


ఇక ఆ తరువాత వరుసగా వికెట్లు సమర్పించుకుంది బెంగళూరు టీం. హైదరాబాద్ బౌలర్లు బెంగళూరు బ్యాట్స్‌మెన్స్ కి చుక్కలు చూపించారు. దీంతో 20 ఓవర్లకు ఆర్‌సీబీ టీం కేవలం 149 పరుగులే చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో జాన్సన్ హోల్డర్ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు, భువనేశ్వర్, నదీమ్, నటరాజన్ తలో వికెట్ పడగొట్టారు.

Tags:    

Similar News