కొత్త పేరుతో పంజాబ్ .. కొత్త కెప్టెన్ తో రాజస్థాన్; గెలిచేదెవరో..?
IPL 2021 RR vs PBKS Preview: ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్.
IPL 2021 RR vs PBKS Preview: ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్. అయితే ఈ సీజన్ లో 'పంజాబ్ కింగ్స్'గా బరిలోకి దిగి తమ లక్ ను పరీక్షించుకోనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రోజు (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన ఈ రెండు టీంలు ఆరింట్లో మాత్రమే గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ టీమ్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా, రాజస్థాన్ రాయల్స్ టీమ్ చివరి స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్ 2021లోనైనా ప్లేఆఫ్‌కి చేరాలని ఈ జట్లు ఆశిస్తున్నాయి.
రికార్డులు..
ఇప్పటి వరకూ పంజాబ్, రాజస్థాన్ జట్లు 21 మ్యాచ్‌ల్లో ఆడాయి. ఇందులో రాజస్థాన్ టీమ్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక పంజాబ్ టీమ్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
టీమ్ స్కోర్స్..
ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై పంజాబ్ 223అత్యధిక స్కోరు సాధించింది. అలాగే అత్యల్ప స్కోరు 124గా ఉంది. ఇక పంజాబ్‌పై రాజస్థాన్ 226 అత్యధిక స్కోరు కాగా.. అత్యల్ప స్కోరు 112.
గత సీజన్స్‌లో పైచేయి ఎవరిది..
ఐపీఎల్ 2020లో రెండు సార్లు తలపడగా.. రెండింట్లోనూ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇక, ఐపీఎల్ 2019 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ కింగ్స్ టీమ్ విజయం సాధించింది. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ను గెలిచిన సంగతి తెలసిందే.
పవర్ హిట్టర్లతో పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కింగ్స్ టీంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్ లాంటి పవర్ హిట్టర్లతో బ్యాటింగ్ లో బలంగా తయారైంది. వీరిలో ఏ ఇద్దరు నిలబడినా మ్యాచ్ స్వరూపం మారిపోయినట్లే. అయితే.. మిడిలార్డర్ లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఆ జట్టు ఈ నలుగురిపైనే ఆధారపడనుంది. మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ మలాన్.. మాక్స్‌వెల్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ జట్టు ఆశిస్తోంది.
బౌలింగ్ పరంగా మహ్మద్ షమీ, క్రిస్ జోర్దాన్, మురగన్ అశ్విన్, రిచర్డ్‌సన్ లు బలంగా కనిపిస్తున్నారు. అలాగే ఆల్‌రౌండర్లు దీపక్ హుడా, హెన్రిక్యూస్ రాణించాలని ఆ జట్టు కోరుకుంటుంది.
నిలకడ లేమితో రాజస్థాన్ రాయల్స్ రాణించేనా..
రాజస్థాన్ రాయల్స్ ఈసారి కూడా ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై ఎక్కువగా ఆధారపడేలా కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ సంజు శాంసన్ సారథ్యంలో జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, డేవిడ్ మిల్లర్, ప్రియమ్ గార్గె, శివమ్ దూబె, రాహుల్ తెవాటియాతో మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నా.. వీరిలో నిలకడలేమి వేధిస్తోంది. అయితే.. బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ రాకతో ఆ జట్టు మెరుగైంది. ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
ప్లేయింగ్ లెవన్ (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్ (కీపర్), బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, లియామ్ లివింగ్స్టోన్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి
పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్