RR vs MI 24th Match Preview: నేడు ముంబయితో రాజస్థాన్ ఢీ

RR vs MI Match Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు(గురువారం) ఢిల్లీలో ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడునుంది.

Update: 2021-04-29 09:00 GMT

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ (ఫొటో ట్విట్టర్)

RR vs MI Match Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు(గురువారం) ఢిల్లీలో ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడునుంది. ఈ మ్యాచ్ 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

ముంబయి టీం ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లాడింది. రెండింటిలో మాత్రమే గెలుపొందింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

హెడ్ టు హెడ్

ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ రాజస్థాన్‌పై చేసిన అత్యధిక స్కోరు 212 పరుగులుకాగా.. ముంబయిపై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 208 పరుగులు.

టీంల బలాబలాలు

ముంబయి ఇండియన్స్

ముంబయి జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ డికాక్ విఫలమవుతున్నాయి. మిడిలార్డర్‌ లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతున్నా.. ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోతున్నారు. ఇక హార్దిక్ పాండ్య కూడా ఇప్పటి వరకు చెప్పుకోదగిన విధంగా జూలు విదల్చలేదు. కాగా, కీరన్ పొలార్డ్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. దీంతో బ్యాటింగ్ లో విఫలమవుతున్నారు.

ఇక బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ముంబయి టీం కి చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. వీరు పవర్ ప్లేతో పాటు లాస్ట్ ఓవర్లలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రాహుల్ చాహర్ వికెట్లు పడగొడుతూ మ్యాచ్ లను టర్న్ చేస్తున్నాడు. అలాగే కృనాల్ పాండ్య మాత్రం భారీగా పరుగులు ఇస్తున్నాడు.

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుతంగా ఆడుతున్నా...కీలక సమయంలో పెవిలియన్ చేరుతున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కానీ, ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోతున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ నిలకడగా ఆడుతున్నాడు. శివమ్ దూబె, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్ కూడా మ్యాచ్ కి అనుగుణంగా ఆడుతున్నారు.

ఇక క్రిస్ మోరీస్ , చేతన్ సకారియా, ముస్తాఫిజుర్, జయదేవ్ ఉనద్కత్ టీంకి మంచి ప్రదర్శన అందిస్తున్నారు. వికెట్లు పడగొడుతూ రాజస్థాన్ టీం ను విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్‌లు మెరుగైన ప్రదర్శన చేయాలని టీం కోరుకుంటుంది.

Tags:    

Similar News