PBKS vs KKR: నేడు పంజాబ్ తో కోల్‌కతా బిగ్ ఫైట్.. రికార్డులివే..
IPL 2021: అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలిసారి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ తో కోల్‌కతా తలపడనుంది.
IPL 2021, PBKS vs KKR: అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి సారి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ తో కోల్‌కతా తలపడుతోంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకి ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2021 సీజన్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కింగ్స్.. 3 మ్యాచ్‌లు ఓడిపోయి.. రెండింట్లో గెలిచింది. ప్రస్తుతం 4 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు 5 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. కేవలం ఒకదాంట్లోనే గెలిచింది. 2 పాయింట్లతో చివరిస్థానంలో ఉంది.
హెడ్ టూ హెడ్ రికార్డులు: మొత్తం మ్యాచ్‌లు 27; కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచినవి 18; పంజాబ్ కింగ్స్ గెలిచివని 9
పంజాబ్‌పై కోల్‌కతా టీం అత్యధికంగా 245 పరుగులు చేయగా, కోల్‌కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులు.
మరికొన్ని విశేషాలు..
- కేకేఆర్‌పై అధిక పరుగులు సాధించిన వారిలో క్రిస్‌గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఉత్తమ సగటుతో పరుగులు సాధించాడు. 700పైగా స్ట్రయికింగ్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అలాగే కోల్‌కతా పై గేల్ 54 సిక్సర్లు కొట్టాడు. ఓ టీంపై అత్యధికంగా సిక్సర్లు కొట్టిన లిస్టులోనూ గేల్ ముందున్నాడు.
- పంజాబ్‌తో జరిగిన ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు అర్ధ సెంచరీలు సాధించిన శుభమన్ గిల్ 104.50 సగటుతో 209 పరుగులు చేశాడు.
- ఐపీఎల్ 2020 లో రెగ్యులర్ ఓపెనర్‌లలో (123.44) గిల్ అతి తక్కువ ఎస్‌ఆర్‌ని కలిగి ఉన్నాడు, కానీ, 14 ఇన్నింగ్స్‌లలో నాలుగుసార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో దూకుడుగా ఆడాడు. కానీ ఇప్పటికే ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం పవర్ ప్లే లోపల మూడుసార్లు అవుట్ అవ్వడం గమనార్హం.
- సునీల్ నరైన్ పంజాబ్‌పై 28 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ 29 వికెట్ల తర్వాత పంబాజ్ జట్టుపై రెండవ అత్యధికం నరైన్ దే. 18.18 సగటు, 6.97 ఎకానమితో నరైన్ 28 వికెట్లు పడగొట్టాడు.