PBKS vs KKR Match Preview: పంజాబ్ జోరు ముందు కోల్‌కతా నిలిచేనా..?

IPL 2021, PBKS vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.

Update: 2021-04-26 09:10 GMT

పంజాబ్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ ప్రివ్యూ (ఫొటో పంజాబ్ కింగ్స్ ట్విట్టర్)

IPL 2021, PBKS vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకి ప్రారంభంకానుంది. అయితే ఈ సారి వేదిక మారింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

వరుస పరాజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో కొట్టుమిట్టాడుతోంది. సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా టీమ్ నాల్గింటిలో ఓడిపోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిలో విజయం సాధించింది.

పిచ్: ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో 124 పరుగుల తక్కువ స్కోర్ తోపాటు 224 అత్యధిక స్కోర్ నమోదైంది. మూడు విజయవంతమైన చేజ్‌లు జరిగాయి. 180పై స్కోర్‌ను రెండు సార్లు చేధించారు. ఈ పిచ్ పై మంచు కూడా ఒక కారకంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లో ఎరుపు , నల్ల మట్టితో చేసిన పిచ్‌లు ఉన్నాయి. టాస్ కీలకంగా మారుతుంది.

హెడ్ టూ హెడ్ రికార్డులు:

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌ల్లో కోల్‌కతా టీమ్ గెలుపొందింది. 9 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్‌పై కోల్‌కతా టీం 245 పరుగులు చేయగా, కోల్‌కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులు.

టీంల బలాబలాలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్:

కోల్‌కతా జట్టులో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ ఇప్పటి వరకు అలరించలేకపోయారు. ఇక నెం.3లో ఆడుతున్న రాహుల్ త్రిపాఠి పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ, భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ తక్కువ పరుగులకే వికెట్ సమర్పించుకుంటున్నారు. ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, పాట్ కమిన్స్, దినేశ్ కార్తీక్ అంచనాలను అందుకోలేక పోతున్నారు. బ్యాటింగ్ లో బలం లేక తక్కువ స్కోర్లకే పరితమవుతున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ టీం

ఇక కోల్‌కతా బౌలర్లు కూడా అనుకుంన్నత మేర రాణించలేక విఫలమవుతున్నారు. పాట్ కమిన్స్‌ భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. అలానే ప్రసీద్, శివమ్ మావి కూడా మంచి ప్రదర్శన ఇప్పటి వరకు చేయలేదు. మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం పరుగులివ్వకున్నా... వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. సునీల్ నరైన్ కూడా తేలిపోవడంతో.. కోల్‌కతా టీం బౌలింగ్ లోనూ విఫలమవుతోంది.

పంజాబ్ కింగ్స్:

పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆకట్టుకుంటున్నారు. క్రిస్‌గేల్ కూడా పర్వాలేదనిపించినా.. భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే.. నికోలస్ పూరన్ వరుసగా డకౌట్లవుతూ నిరాశపరుస్తున్నాడు. దీపక్ హుడా, హెన్రిక్యూస్, షారూక్ ఖాన్ మ్యాచ్‌లను అంచనాలు అందుకోలేకపోతున్నారు.

పంజాబ్ కింగ్స్ టీం

బౌలింగ్ పరంగా చూస్తే.. మహ్మద్ షమీ తన షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని తిప్పలు పెడుతున్నాడు. కానీ, వికెట్లు రెగ్యులర్ గా తీయలేకపోతున్నాడు. అర్షదీప్ సింగ్ కూడా ఆకట్టుకుంటున్నాడు. స్పిన్నర్ ఫాబియన్ అలెన్ భారీగా పరుగులిస్తున్నాడు. అలాగే రవి బిష్ణోయ్, దీపక్ హుడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. హెన్రిక్యూస్ కూడా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నాడు. గత మ్యాచ్ లో ముంబయిపై 9 వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్ ప్రస్తుతం మంచి ఊపులో ఉందనడంలో సందేహం లేదు.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

కోల్‌కతా నైట్‌ రైడర్స్: నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి, శివం మావి

పంజాబ్ కింగ్స్: కె.ఎల్. రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, మొయిసెస్ హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్ / రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

Tags:    

Similar News