KKR vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కలకత్తా.. ఢిల్లీ 127/9 (20 ఓవర్లు)
* బౌలింగ్ లో రాణించిన కలకత్తా నైట్ రైడర్స్ * బ్యాటింగ్ లో కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్
KKR vs DC: మంగళవారం కలకత్తా నైట్ రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆరంభంలో దాటిగా ఆడి 20 బంతుల్లో 24 పరుగులు సాధించి ఫెర్గుసన్ బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ చేతికి చిక్కి ఔటై పెవిలియన్ చేరాడు. ఢిల్లీ జట్టు తరుపున గత రెండు మ్యాచ్ లలో మంచి ప్రదర్శన కనబరిచిన శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు.
పృద్వీ షా స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ స్టీవ్ స్మిత్ 39 పరుగులు సాధించి ఫెర్గుసన్ బౌలింగ్ లో ఔటై వెనుతిరిగాడు. మరోపక్క ఓపెనర్లు మినహా హిట్మేయర్ 4, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్ లు పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయి అభిమానులను నిరాశ పరిచారు. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ తన నిలకడైన బ్యాటింగ్ తో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చివరి ఓవర్ లో రనౌట్ అయ్యాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 127 పరుగులు సాధించింది. కలకత్తా నైట్ రైడర్స్ జట్టులో బౌలర్స్ వెంకటేష్ అయ్యర్, సునీల్ నరేన్, ఫెర్గుసన్ తలో 2 వికెట్లను, టీమ్ సౌతి ఒక వికెట్ ని పడగొట్టారు.