DC vs RCB Match Records: నేడు ఢిల్లీ తో బెంగళూరు పోరు.. రికార్డులివే..
DC vs RCB Match Records: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో బెంగళూరు తలపడుతోంది.
DC vs RCB Match Records: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో బెంగళూరు తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్ జరగనుంది.
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అనూహ్యంగా ఐదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గత ఆదివారం చెపాక్‌లో సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ బౌలింగ్‌తో క్లిష్టంగా మార్చుకుని.. ఆఖరికి సూపర్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
ఢిల్లీ వర్సెస్ బెంగళూరు విశేషాలు చూద్దాం..
- ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
- ఢిల్లీపై ఇప్పటి వరకూ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు. అలాగే బెంగళూరుపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు మాత్రమే.
- అమిత్ మిశ్రా ఇప్పటి వరకు గ్లెన్ మాక్స్వెల్ ను నాలుగుసార్లు అవుట్ చేశాడు. 11.38 ఎకానమీ రేటుతో వికెట్లు తీస్తున్నాడు.వీరిద్దరు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు ఆసక్తికరమైన మ్యాచ్ అప్ అవుతారు.
- శిఖర్ ధావన్‌పై యుజ్వేంద్ర చాహల్ మంచి రికార్డును కలిగి ఉన్నాడు. 6.95 ఎకానమీతో 3 సార్లు ఔట్ చేశాడు. అలాగే ఢిల్లీ విజయవంతమైన ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు అతను ఒక ఎంపిక కావొచ్చు.
- బెంగళూరుపై ఢిల్లీ టీం వరుసగా నాలుగు సార్లు గెలిచింది.
- పవర్ ప్లే లో బెంగళూరు టీం అత్యధిక రన్ రేట్ ని కలిగి ఉంది.
- రెండు టీంలలో ఓపెనర్లు అద్భుత ఫాంలో ఉన్నారు. ఢిల్లీ నుంచి పృథ్వీ షా-శిఖర్ ధావన్, బెంగళూరు నుంచి విరాట్ కోహ్లీ-దేవదత్ పాడికల్ అంచనాలకు మించి రాణిస్తూ... టీం లకు మంచి ఆరంభాలను అందిస్తున్నారు.