David Warner: సన్ రైజర్స్ కి వార్నర్ గుడ్ బై..!! ఐపీఎల్ 2022లో బెంగుళూరు జట్టులోకి..!?

* ఐపీఎల్ 2022లో డేవిడ్ వార్నర్ కోసం భారీగా చెల్లించేందుకు సిద్దమైన బెంగుళూరు జట్టు

Update: 2021-09-28 07:09 GMT

సన్ రైజర్స్ జట్టుకి వార్నర్ గుడ్ బై..!! (ట్విట్టర్ ఫోటో)

David Warner: ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ పేరుకు విదేశీ ఆటగాడే కాని ఐపీఎల్ లో తన ఆటతో, తన ప్రవర్తనతో లక్షలాది మంది అభిమానులను  సొంతంచేసుకున్నాడు. 2014 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన వార్నర్ 2015 కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేవిడ్ వార్నర్ 2016 లో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ కప్ ని అందించాడు.

తన అద్భుత బ్యాటింగ్ తో మూడుసార్లు(2015, 2017,2019) ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు డేవిడ్. తాజాగా ఐపీఎల్ 2021 మొదటి ఫేజ్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన వార్నర్ ను కెప్టెన్సీ నుండి తొలగించడమే కాకుండా తుదిజట్టులో స్థానం కూడా కల్పించకపోవడం హైదరాబాద్ జట్టు అభిమానులను నిరాశపరిచింది.

ఇక ఐపీఎల్ రెండో ఫేజ్ లో జట్టులో స్థానం వస్తుందో లేదో అనుమానంతోనే యూఏఈకి చేరిన డేవిడ్ వార్నర్ కు రెండో ఫేజ్ లో జట్టులో స్థానం కల్పించిన మొదటి మ్యాచ్ లో సున్నా పరుగులకు, రెండో మ్యాచ్ లో 2 పరుగులకు ఔటై అభిమానులను మరోసారి నిరాశపరిచాడు.

దీంతో తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో వార్నర్ ని పక్కనపెట్టిన హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్ కు సారధ్యంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై హైదరాబాద్ గెలవడంతో ఈ సీజన్ లో రెండో విజయాన్ని సాధించింది.మరోవైపు సన్ రైసర్స్ జట్టుకు ప్లేఆఫ్ కి వెళ్ళే అవకాశాలు లేకపోవడంతో ఇక రానున్న మ్యాచ్ లలో వార్నర్ ని పక్కనపెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే ఈ సీజన్ తో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 2022 కోసం రిటైన్ ఆప్షన్ లో హైదరాబాద్ జట్టు విదేశీ ఆటగాళ్ళ లిస్టులో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ ని రిటైన్ చేసుకోనుంది. దీంతో డేవిడ్ వార్నర్ కోసం బెంగుళూరు జట్టు త్వరలో జరగబోయే పెద్ద మొత్తంలో వేలం పాటలో చెల్లించి జట్టులోకి తీసుకోడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్ తరువాత బెంగుళూరు జట్టు కెప్టెన్సీ నుండి తప్పుకుంటానని ప్రకటించిన కోహ్లి స్థానంలో డేవిడ్ వార్నర్ కి ఆ కెప్టెన్ బాధ్యతలతో సహా ఓపెనర్ బ్యాట్స్ మెన్ అవడంతో బెంగుళూరు జట్టు ఓపెనింగ్ మరింత బలం చేకూరుతుందనే ఆలోచనలో ఉన్నారు బెంగుళూరు జట్టు యాజమాన్యం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలో జరగబోయే ఐపీఎల్ 2022 లో డేవిడ్ వార్నర్ బెంగుళూరు జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News